నామినేషన్ల స్వీకరణకు సిద్ధంగా ఉండాలి : కలెక్టర్  

నామినేషన్ల స్వీకరణకు సిద్ధంగా ఉండాలి : కలెక్టర్  

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి:నామినేషన్ల స్వీకరణకు పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్  రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ రెడ్డికి సూచించారు. బుధవారం  కామారెడ్డి ఆర్.డి.ఓ. కార్యాలయంలో  నియోజక వర్గ నామినేషన్ల స్వీకరణ ఏర్పాట్లను అదనపు కలెక్టర్ చంద్ర మోహన్ తో  కలిసి పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా నామినేషన్ల స్వీకరణకు అభ్యర్థులకు అందజేయవలసిన ఫారం-2బి, అఫిడవిట్ ఫారం-26, వారి నుండి తీసుకోవలసిన డాక్యుమెంట్లతో  పాటు, అభ్యర్థులకు  మాడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మార్గదర్శకాలపై హ్యాండ్ బుక్ అందజేయాలన్నారు. నామినేషన్ పత్రాలు, అఫిడవిట్ నింపడంలో వారికి సహకరించాలన్నారు.  

అభ్యర్థి గదిలోకి ప్రవేశించిన వెంటనే కనిపించే విధంగా డిజిటల్ గడియారం, సి .సి. కెమెరా ఉండాలన్నారు. . అభ్యర్థులు తమ  వాహనాలను నామినేషన్  కేంద్రానికి వంద మీటర్ల దూరం లో  పార్క్ చేసుకునే విధంగా బ్యారికేడింగ్ ఏర్పాటు చేయాలనీ సూచించారు. ఆన్ లైన్ లో వచ్చే నామినేషన్లకు సంబంధించి బౌతికంగా హార్డ్ కాపీ తీసుకోవాలన్నారు.నామినేషన్ల ఉపసంహరణ అనంతరం బ్యాలట్ పేపర్ ముద్రణ చేపట్టాలన్నారు.  రెండవ విడత ఈవీఎం, వివిప్యాట్ ల  ర్యాండమైజేషన్ నిర్వహించి, పి .ఓ. ఎపిఓ లకు  ఈవీఎం, వివి ఫ్యాట్ యంత్రాల నిర్వహణ, బ్యాలట్ పేపర్ సీలింగ్,  ఎలక్షన్  ఫారాలు నింపడం,   ప్యాకెట్ 1,2,3  మెటీరియల్స్ పై   ప్రాక్టికల్ గా అవగాహన కలిగించాలన్నారు.  పూర్తిగా బెడ్ కే  అంకితమై   పోలింగ్ కేంద్రానికి రాలేని  వృద్దులు, వికలాంగుల కోసం  ప్రత్యేక టీమ్ తో  వెళ్లి  వారి యొక్క ఓటును స్వీకరించేందుకు  తగుఏర్పాట్లు  చేసుకోవాలన్నారు. మాస్టర్ రోల్ తో పాటు  అనుబంధ  ఓటర్ రోల్ జాబితా సిద్ధంగా  ఉంచుకోవాలని సూచించారు. సాధారణ పరిశీలకులకు  పొలింగ్ బూతు వారీగా రూట్ మ్యాప్, సమస్యాత్మక పోలింగ్  కేంద్రాలు, మాడల్ పోలింగ్  స్టేషన్ వివరాలు అందించాలన్నారు.   శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ రెడ్డి, తహశీల్ధార్  లత , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు