ఇంటర్ విద్యార్థులకు సాఫ్ట్వేర్ రంగంలో  హెచ్ సి ఎల్ టెక్ బి: కలెక్టర్ ఆధ్వర్యంలో మెగా ఉద్యోగ మేళా

ఇంటర్ విద్యార్థులకు సాఫ్ట్వేర్ రంగంలో  హెచ్ సి ఎల్ టెక్ బి:  కలెక్టర్ ఆధ్వర్యంలో మెగా ఉద్యోగ మేళా

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి:  హెచ్ సి ఎల్ టెక్ బి వారు నిర్వహిస్తున్న టెక్ బి ప్రోగ్రాం కొరకు  2022-23 ఎంపిసి, ఎం ఈ సి లో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు  ఈ నెల8న  శనివారం రోజున ఉదయం 9గంటలకు కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో మెగా జాబ్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు.  

అర్హులైన అభ్యర్థులు అర్హత పదో తరగతి, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత / హాల్ టికెట్, ఆధార్ కార్డు నకలు ఆండ్రాయిడ్ మొబైల్ తో డ్రైవ్ స్థలానికి తప్పకుండా హాజరుకావాలని కోరారు.  కలెక్టర్ జితేష్ వి పాటిల్ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హెచ్.సి.ఎల్. తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ ఎస్. శ్రీనివాస్  పాల్గొన్నారు. పూర్తి వివరాలకు ఈ క్రింది సెల్ఫోన్ నెంబర్ను సంప్రదించాలని  8074065803 , 9493553821 పేర్కొన్నారు.