ఎన్నికల సామాగ్రిని స్ట్రాంగ్ రూంలో భద్రప్రచాలి : కలెక్టర్

ఎన్నికల సామాగ్రిని స్ట్రాంగ్ రూంలో భద్రప్రచాలి : కలెక్టర్

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి:ఎన్నికల కు సంబంధించిన కంట్రోల్ యూనిట్లు, బ్యాలట్ యూనిట్లు, వి వి ప్యాట్లు మొదటి ర్యాండమైజేషన్  పూర్తి అయిన పిదప   స్ట్రాంగ్ రూమ్ లలో బద్రపరచాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు.  శుక్రవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ చంద్ర మోహన్ తో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులు, తహసీల్ధార్లతో  ఏర్పాటు చేసిన సమావేశంలో  మాట్లాడుతూ జిల్లాలోని మూడు నియోజక వర్గాల్లో 6,61,163 మంది ఓటర్లున్నారని, 791 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎన్నికల నిర్వహణకు  సంబంధించి కంట్రోల్ యూనిట్లు, బ్యాలట్ యూనిట్లు 25 శాతం , వివి ఫ్యాట్ లు 40 శాతం  అదనంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. మొదటి  ర్యాండమైజేషన్ లో ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా ఆటోమాటిక్ గ  నియోజక వర్గం, పోలింగ్ బూత్ వారీగా ఏ ఏ యంత్రాలు కేటాయించాలో  జనరేట్ చేసిన జాబితాను అందజేస్తూ శనివారం ఉదయం 8 గంటల వరకెల్లా ఏ.వి.ఏం. గోదాములకు రావాలని కోరారు.

అక్కడ నియోజక వర్గం వారీగా జనరేట్ చేసిన జాబితా ప్రకారం   కంట్రోల్ యూనిట్లు, బ్యాలట్ యూనిట్లు, వి.వి.ఫ్యాట్ లను  ఆయా నియాజక వర్గాలకు గట్టి భద్రత మధ్య తరలించి అక్కడ ప్రజాప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరుస్తామని అన్నారు.  రెండవ దఫా లో  ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్  సిబ్బంది  ర్యాండమైజేషన్ జరుగుతుందని ,   నవంబర్ 28 న మూడవ ర్యాండమైజేషన్ లో కంట్రోల్ యూనిట్లు, బ్యాలట్ యూనిట్లు, వి వి ప్యాట్లు  ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలించుటకు సిద్ధం చేస్తామని  అన్నారు. పోలింగ్ ఏజెంట్లను త్వరగా నియమించుకోవాలని పార్టీల  ప్రతినిధులకు సూచించారు. ఏజెంట్లు ఎన్నికల ప్రక్రియ లో, పోలింగ్ సమయంలో ఏమో చేయాలో, తగు శిక్షణ ఇవ్వాలని తహసీల్ధార్లకు సూచించారు. ముందస్తు అనుమతి లేకుండా ప్రకటనలు, వాహనాలు, సభలు, సమావేశాలు ఏర్పాటు, , డబ్బు పంపిణి, తాయిలాలు ఇవ్వడం  వంటివి దృష్టికి వస్తే వెంటనే తెలపాలని, లేకుంటే అభ్యర్థి ఖర్చు క్రిందకు వెళుతుందని తెలిపారు.  సామాజిక మాడిమలలో వచ్చిన అసత్య వార్తల పట్ల అప్రమత్తం ఉండాలని, అభ్యంతరకర పోస్టులు ఉండరాదని హితవు చెప్పారు. ఈ సమాసీవేశంలో  ఆర్డీఓ శ్రీనివాస్ రెడ్డి, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, తహసీల్ధార్లు తదితరులు పాల్గొన్నారు.  
.