ఎన్నికల ఖర్చులను పక్కాగా లెక్కించాలి : వ్యయ పరిశీలకుడు

ఎన్నికల ఖర్చులను పక్కాగా లెక్కించాలి : వ్యయ పరిశీలకుడు

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: ఎన్నికలలో అభ్యర్థులు చేసే  ఖర్చును అకౌటింగ్ టీమ్ పక్కాగా నిర్వహించాలని  వ్యయ పరిశీలకులు పరా శివమూర్తి సూచించారు. జిల్లాకు వ్యయ పరిశీలకులుగా వచ్చిన పరా శివమూర్తి శుక్రవారం కలెక్టరేట్ లోని సమావేశం మందిరంలో నోడల్ అధికారులు, సహాయ వ్యయ పరిశీలకులు, FST,VST,SST తదితర బృందాలు, ఎన్నికల విభాగం అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి  జితేష్ వి పాటిల్, ఎస్పీ సింధు శర్మతో  కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులనుదేశించి మాట్లాడుతూ అభ్యర్థుల ఖర్చులకు సంబంధించి ఎలా   లెక్కించాలి, రిజిస్టర్లల్లో ఎలా నమోదు చేయాలో అకౌంటింగ్ టీమ్ కు  పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు.వీడియో సర్యేలెన్సు టీమ్ ఇచ్చే  వీడియో  ఫుటేజీ, ఎవిడెన్స్  ఆధారంగా ఖర్చును లెక్కించి జాగ్రత్తగా అభ్యర్థి షాడో రిజిస్టర్ లో నమోదు చేయాలన్నారు. అదేవిధంగా ఫ్లైయింగ్ స్క్వాడ్, స్టాస్టికల్ సర్వేలెన్స్ టీమ్ , ఏం.సి.ఏం.సి.తదితర అన్ని  కమిటీలు  నుండి సమాచారాన్ని సేకరించి వాటి  ఆధారంగా ఖర్చును లెక్కిస్తూ రోజు వారి నివేదికలు సమర్పించాలని సూచించారు. అభ్యర్థి ఖర్చు రిజిస్టర్ తో సరిపోల్చుకోవాలన్నారు. అకౌంటింగ్ నిర్వహణలో ఏ అనుమానాలున్న వెంటనే నివృత్తి చేసుకోవాలన్నారు. 

ఈ నెల రోజులు అత్యంత కీలకమని, అకౌంటింగ్ టీమ్ సమన్వయంతో పనిచేయాలని కోరారు. వ్యయ నిర్వహణకు సంబంధించి  ఎన్నికల సంఘం సూచంచిన మార్గదర్శకాల సంగ్రహ పుస్తకం తెలుగులో రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు   అందించాలని సూచించారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు సంబంధించి ప్రజలు జిల్లా యంత్రాంగానికి సమాచారం అందించి విధంగా సి-విజిల్ యాప్, 1950 టోల్ ఫ్రీ నెంబరుతో పాటు వాట్సాప్ ద్వారా  వాయిస్ మెస్సేజి లు ఇచ్చుటకు,  మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయుటకు  కంట్రోల్ రూమ్ లో  24 గంటలు పనిచేసే విధంగా తగు ఏర్పాట్లు చేయవలసినదిగా సూచించారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 లోని 127-ఏ సెక్షన్ ప్రకారం  ప్రింటర్లు అభ్యర్థుల అనుమతి, లేకుండా   కరపత్రాలు, గోడపత్రికలు ఎన్నికల సామాగ్రి ముద్రించరాదని స్పష్టం చేశారు. 

జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ జిల్లాలో ఫ్లైయింగ్ స్క్వాడ్, స్టాస్టికల్ సర్వేలెన్స్ బృంద వాహనాలకు సి.సి.కెమెరా, జిపిఎస్ ట్రాకింగ్ ఏర్పాటు చేసి చెక్ పోస్టుల వద్ద ఘాటీ నిఘా పెట్టామన్నారు. కంట్రోల్ రూమ్ ల  సీ -విజిల్ ద్వారా వచ్చే ఫిర్యాదులకు తక్షణమే స్పందించి అక్కడ సమీపంలోని  ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలకు సమాచారమందించి వంద నిముషాలలో  చేరుకొని చర్యలు తీసుకుంటున్నామని,  ఇప్పటి వరకు 21 ఫిర్యాదులందాయన్నారు.  1950 టోల్ ఫ్రీ నెంబరు ద్వారా వచ్చే ఫిర్యాదులకు సమాధానమిస్తున్నామన్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు సామాజిక, ఇతర  మాద్యమా లలో వచ్చే రాజకీయ ప్రకటనలు నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. 24 గంటలు పనిచేసే విధంగా కంట్రోల్ రూమ్ నిర్వహిస్తున్నామన్నారు.  సువిధ యాప్ ద్వారా ఫస్ట్ కామ్ ఫస్ట్ పద్దతిలో అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. ఎస్పీ సింధు శర్మ మాట్లాడుతూ జిల్లాలో నగదు, మద్యం, నార్కోటిక్ వంటి అక్రమ రవాణాకు గట్టి చర్యలు తీసుకున్నామని ఇప్పటి వరకు కోటి 72 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు.  మహారాష్ట్ర కర్ణాటక సరిహద్దు ప్రాంతాలు, అంటారు జిల్లా, జిల్లాలో గల 8 చెక్ పోస్టుల వద్ద  నిరంతరం నిఘా ఉంచామని అన్నారు.అనంతరం కంట్రోల్ రూమ్ లో ఏం.సి.ఏం.సి ద్వారా చేస్తున్న  18 ఛానళ్ల రికార్డింగ్, సామాజిక మాధ్యమాల పరిశీలన, .  సి-విజిల్, 1950, ల పనితీరును పరిశీలించి వ్యయ పరిశీలకులు పరా శివమూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. .  ఈ సమావేశంలో నోడల్ అధికారులు, అకౌంటింగ్ టీమ్, ఎలక్షన్ సూపరింటెండెంట్ లు తదితరులు పాల్గొన్నారు.