ట్రక్కు- వ్యాన్ ఢీ.. ముగ్గురు మృతి, 10 మందికి గాయాలు
ముద్ర,ఆంధ్రప్రదేశ్:- విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వ్యాన్‌ను ట్రక్కు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందగా, మరో 10 మంది గాయపడ్డారు. ఈ ఘటన పెందుర్తి అక్కిరెడ్డిపాలెంలో జరిగింది. వ్యాన్‌లో ప్రయాణిస్తున్న హనుమంతు ఆనందరావు (45), హనుమంతు శేఖర్‌రావు (15), చింతాడి ఇందు (65) ట్రక్కుని ఢీకొట్టిన ఘటనలో అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన వారంతా ఏలూరు జిల్లా తాళ్లపూడి మండలం తిరుగుడుమెట్ట చెందిన వారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీకాళం జిల్లా పొందూరులో వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. ప్రమాదంపై పోలీసులు తదుపరి విచారణ ప్రారంభించారు.