అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి...

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి...
  • కుల వివక్షే కారణమని మృతురాలి బంధువుల ఆరోపణ
  • సంఘటన స్థలాన్ని పరిశీలించిన డిఎస్పీ రఘు చందర్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల పట్టణంలోని మార్కండేయ నగర్ లోఅనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందింది. అయితే కుల వివక్ష కారణంగానే తన కూతురు మృతి చెందిందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ధర్మపురి మండలం తిమ్మపూర్ కు చెందిన సుధారాణి, గొల్లపల్లి మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన రంజిత్ లు నాలుగు సంవత్సరాలు క్రీతం ప్రేమ వివాహం చేసుకున్నారు. జగిత్యాల పట్టణంలోని మార్కండేయ నగర్ లో నివాసం ఉంటున్నా వీరికి హర్షవర్ధన్ అనే మూడేళ్ళ కొడుకు ఉన్నాడు. కులాంతర వివాహం కారణంగానే గత కొంత కాలంగా భార్య భర్తల మధ్య గోడవలు నడుస్తున్నాయి.

పెళ్లి అయిన నాటి నుండి సుధారాణి బంధువులు ఎవరు ఇంటికి రావద్దని వేధించే వాడని, ఈ నెల 4న కొడుకు హర్ష వర్ధన్ వెంట్రుకల పండుగ ఉండగా, నీ తల్లిదండ్రులు ,బంధువులు ఎవరు రావద్దని సుధారాణి తో భర్త రంజిత్ గొడవపడినట్లు పేర్కొన్నారు. అయెతే పుట్టు వెంట్రుకలు మేనమామ తియాల్సి ఉండగా మీ సోదరుడు రావద్దని భర్త రంజిత్ చెప్పడంతో రెండు రోజులుగా గొడవలు జరిగి సుధారాణి మనస్థాపానికి గురైనట్లు పేర్కొన్నారు. బుధవారం ఉదయం సుధారాణి భర్త తమకు ఫోన్ చేసి సుధారాణి మంచం పై నుండి లేవడం లేదని నోటిలో నుండి నురుగులు వస్తున్నాయని ఆసుపత్రికి తీసుకెళ్తున్నామని ఫోన్ చేసి రంజిత్ పేర్కొన్నాడు.

కొద్దిసేపటి తర్వాత మళ్లీ ఫోన్ చేసి సుధారాణి మృతి చెందిందని తెలిపాడు. అయితే కుల వివక్ష కారణంగానే తమ కూతురును హత్య చేశారని నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలు తల్లి కాళ్ళ వసంత జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు డీఎస్పీ రఘు చందర్, పట్టణ సీఐ వేణుగోపాల్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.