ఉమ్మడి రాష్ట్రంలో ధూప దీప నైవేద్యాలకు నోచుకోని దేవాలయాలు. ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు

ఉమ్మడి రాష్ట్రంలో ధూప దీప నైవేద్యాలకు నోచుకోని దేవాలయాలు. ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు

మెట్‌పల్లి ముద్ర:-ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయాలు ధూప దీప నైవేద్యాలకు నోచుకోలేవని తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దేవాలయాల్లో ధూప దీప నైవేద్యాలు నిర్వహించేందుకు ప్రత్యేక నిధులను మంజూరు చేస్తున్నాడని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఆధ్యాత్మిక దినోత్సవం కార్యక్రమంలో మండలంలోని గండి హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ధూప దీప నైవేద్యాలకు సంబంధించిన ప్రొసీడింగ్ లను దేవాలయ పూజారులకు అందజేశారు.ఉమ్మడి రాష్ట్రంలో ప్రాచీన దేవాలయాలలో ధూప దీప నైవేద్యాలు సమర్పించే వారు లేక వేలవేలపోయాయని.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రాచీన దేవాలయాలు ధూప దీప నైవేద్యాలతో కలకలలాడుతున్నాయని. వీటి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ 6వేల రూపాయలను అందజేస్తున్నాడన్నారు. ఈ పథకం ప్రతి గ్రామ, మండల, పట్టణ, జిల్లాలోని దేవాలయాలలో కొనసాగుతుందన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ రణవేణి సుజాత సత్యనారాయణ, వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖర రావు, కౌన్సిలర్ లు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు.