ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలు కాపాడండి

ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలు కాపాడండి
  • మల్యాల సీఐ కోటేశ్వర్
  • రాజారoలో పోలీసుల అవగాహన సదస్సు

ముద్ర, మల్యాల: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని, ప్రమాదాలు జరిగినప్పుడు విధిగా సహకారం అందించి ప్రాణాలు కాపాడాలని మల్యాల సర్కిల్ ఇన్స్పెక్టర్ బిల్ల కోటేశ్వర్ కోరారు. మండలంలోని రాజారo గ్రామంలో శుక్రవారం మల్యాల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రమాదాలు జరిగినప్పుడు చేయవల్సిన ప్రథమ చికిత్సపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా పాల్గొన్న సీఐ మాట్లాడుతూ ఇప్పటి వరకు లక్షా 55 వేల 222 మంది రోడ్డు ప్రమాదంలోనే చనిపోయినట్లు పేర్కొన్నారు. రోడ్డుపై ఎలా ప్రయాణించాలో అవగాహన లేక, అతి వేగంతో విలువైన ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. అంతే కాకుండా సరైన డాక్యుమెంట్స్, లైసెన్స్ వాహనదారుల వద్ద ప్రాపర్ గా ఉండడం లేదని, అందుకోసమే వెహికిల్ చెకింగ్ నిత్యం చేపడుతున్నామన్నారు.

తల్లిదండ్రులు ముఖ్యంగా మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దన్నారు. అలాగే ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సింగిల్ విండో అధ్యక్షులు ఆయిల్నేని సాగర్ రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రాపర్ గా జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని అన్నారు. అనంతరం అధికారులు, వైద్య సిబ్బంది ఎవరైనా గుండెపోటుకు గురైనప్పుడు  చేయవలసిన ప్రథమ చికిత్సపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ తీగల అశోక్, సింగిల్ విండో చైర్మన్ సాగర్ రావు, సర్పంచ్ ఎడిపల్లి సుగుణఅశోక్, ఉపసర్పంచ్ శ్రీనివాస్, వైద్యులు లవకుమార్, శ్రీకాంత్, మౌనిక, రాధ, సిబ్బంది, వార్డు సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.