గిరిజన గురుకులాల్లో ఇంటర్ అడ్మిషన్ లకు స్పాట్ అడ్మిషన్ లు

గిరిజన గురుకులాల్లో ఇంటర్ అడ్మిషన్ లకు స్పాట్ అడ్మిషన్ లు
  • మెదక్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు అవకాశం
  • 10న బాలికలకు చేగుంటలో, 11న బాలురకు నర్సాపూర్ లో కౌన్సిలింగ్
  • రీజినల్ కో ఆర్డినేటర్ సంపత్ కుమార్

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలోని గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో మిగిలిపోయిన సీట్ల ప్రవేశాల కోసం స్పాట్ అడ్మిషన్ నిర్వహిస్తామని రీజినల్ కో ఆర్డినేటర్ టి. సంపత్ కుమార్ శుక్రవారం తెలిపారు. ఈ నెల 10న చేగుంట గిరిజన గురుకులంలో బాలికలకు, 11న నర్సాపూర్ గిరిజన బాలుర గురుకులంలో బాలురకు  కౌన్సిలింగ్ ఉంటుందని చెప్పారు. ఆసక్తిగల విద్యార్థులు 10వ తరగతి మెమో, టీసీ, బొనాఫైడ్, కుల, ఆదాయ, నివాస, ఫిజికల్ ఫిట్నెస్ ధృవీకరణ పత్రాలు, ఆధార్ కార్డుతోపాటు 8 పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకుని ఆ రోజు కౌన్సిలింగ్ సమయం ఉదయం 11 గంటల్లోపు హాజరు కావాలని సూచించారు. ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు అనుమతి ఉండదని తెలిపారు.