ఆకర్షణగా హరితహారం మొక్కలు

ఆకర్షణగా హరితహారం మొక్కలు

భూదాన్ పోచంపల్లి, ముద్ర:- గ్రామాలలోని రహదారులకు అధికారులు మొక్కలు నాటి సంరక్షించారు. నాటి మొక్కలు నేడు చెట్లు గా మారి ఆయా గ్రామాల ప్రజలకు, వాహనదారులను కనువిందు చేస్తున్నాయి. ప్రపంచ పర్యాటక ప్రాంతంగా పేరుగాంచిన భూదాన్ పోచంపల్లి నుండి జూలూరు  గ్రామాల మధ్య గల రహదారికి ఇరువైపులా ఉన్న మొక్కలు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తున్నాయి. రహదారికి రెండు వైపులా నాటిన మొక్కలు పచ్చగా ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఎంతో అందంగా దర్శనమిస్తున్నాయి .ఈ రహదారి గుండా వెళ్లే వాహనదారులు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటితే పచ్చని వాతావరణం తోపాటు హరిత మండలంగా తీర్చిదిద్దవచ్చునని పలువురు అంటున్నారు.