బిచ్కుందలో బిఆరెస్ అభ్యర్థి హన్మంత్ షిండే ప్రచారం

బిచ్కుందలో బిఆరెస్ అభ్యర్థి హన్మంత్ షిండే ప్రచారం

బిచ్కుంద, ముద్ర: బిచ్కుంద మండలం పుల్కల్ గ్రామంలో గురువారం రోజు బి ఆర్ఎస్ పార్టీ అభ్యర్థి హనుమంత్ సిండే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికి బిఆర్ఎస్ పార్టీకి జేజేలు పలికారు. గ్రామంలో మంగళహారతులతో అభ్యర్థికి స్వాగతం పలికి కారు గుర్తుకు ఓటేస్తామని ప్రజలు నినాదాలు చేశారు. ఈసందర్భంగా షిండే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు.