రేవంత్‌రెడ్డి కాదు.. ‘రేటెంత’రెడ్డి

రేవంత్‌రెడ్డి కాదు.. ‘రేటెంత’రెడ్డి
  • ఓటుకు నోటులో దొరికిన దొంగ నువ్వు
  • బీఆర్‌‌ఎస్‌ అభ్యర్థుల‌పై విమర్శలు మానుకో..
  • ఎవరు పనిచేసే వారో ప్రజలకు తెలుసు
  • రాష్ట్రంలో కాంగ్రెస్‌ వచ్చేదిలేదు.. సచ్చేది లేదు..
  • జనగామ జడ్పీ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి

ముద్ర ప్రతినిధి, జనగామ : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అసలు పేరు ‘రేటెంతరెడ్డి’ అంట.. ఆ పార్టీ నాయకులే ఈ కొత్త పేరు పెట్టుకున్నారని జనగామ జడ్పీ చైర్మన్‌, బీఆర్‌‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. జనగామ లీడర్లపై రేవంత్‌రెడ్డి చేసిన విమర్శలపై గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాగాల ఘాటుగా స్పందించారు. జనగామలో జరిగిన కాంగ్రెస్‌ మీటింగ్‌ అట్టర్‌‌ ఫ్లాప్‌ అయ్యిందన్నారు. జనం లేని సభలో రేవంత్‌రెడ్డి పిచ్చెక్కే ఇష్టం వచ్చిమాట్లాడని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి పిచ్చి‌కూతలకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. పల్లాను బొంద పెట్టాలన్న రేవంత్‌రెడ్డిని ప్రజలే ఈ ఎన్నికల్లో బొందపెడతారన్నారు. ఉద్యమ సమయంలో టీడీపీ తొత్తుగా ఉండి తెలంగాణకు ద్రోహం చేశాడని ఆరోపించారు. ఎన్నికలు రాగానే రేవంత్‌రెడ్డి ప్రజలు గుర్తుకొస్తారని, పీసీసీ ప్రెసిడెంట్‌ కాగానే సిపాయిల మాట్లాడుతున్నాడని అన్నారు.

పల్లా, దయాకర్, కడియంపై నోటికొచ్చినట్లు మాట్లాడిన రేవంత్‌రెడ్డికి బుద్ధి చెప్పే రోజులు ముందున్నాయి.- ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని, బ్లాక్ మెయిల్ చేసి కాంట్రాక్టర్లను బెదిరిస్తూ బతుకుతున్నాడని ఆరోపించారు. టికెట్లు అమ్ముకొని‌ బుద్దిమంతుడిలా‌ మాట్లాడుతున్నా తీరు.. ‘దొంగే.. దొంగ’ అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌‌ నియోజకవర్గం సోడషపల్లికి చెందిన పల్లా రాజేశ్వర్‌‌రెడ్డిని రేవంత్‌రెడ్డిని స్థానికేతరు అనడం విడ్డూరంగా ఉందన్నారు. మరి మీరు బరిలో నిలిపిన సిద్ధిపేట జిల్లా మద్దూరు మండలం నర్సాయపల్లికి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి స్థానికుడు ఎలా అవుతాడని పాగాల ప్రశ్నించారు. మీ రాష్ట్రాల్లో గ్యారెంటీలు ఏవి? కాంగ్రెస్‌ చెబుతున్న గ్యారెంటీలు వారు పాలిస్తున్న రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని పాగాల ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ప్రజల మోసం చేయాలని చూస్తోందని, కానీ ఇక్కడి జనం వారిని దగ్గరికి కూడా రానివ్వరన్నారు.

బంగారు తెలంగాణ దిశగా వెళ్తున్న రాష్ట్రంపై ఆంధ్రా నాయకులతో కలిసి కుట్ర పన్నుతున్న రేవంత్‌రెడ్డికి తగిన బుద్ధి చెబుతానని జోస్యం చెప్పారు. బీఆర్‌‌ఎస్‌ అనేది ఒక క్రమశిక్షణ గల పార్టీ, స్పష్టమైన విధానంతో ముందుకు సాగుతున్న నేత కేసీఆర్‌ అన్నారు. ఇక రేవంత్‌రెడ్డి.. సభకు జనం రాక అసహనంతో వేదిక‌పైనే ఉన్న అభ్యర్థిని‌ ‘సతాయించకు’ అంటూ చీదరించుకున్నాడని, దీన్ని బట్టి ఆయన సంస్కృతి ఏమిటో అర్థం చేసుకోవచ్చాన్నారు. రేవంత్ రెడ్డికి బలుపు చేష్టలు, బలుపు మాటలే తప్ప వేరే ఏమీతెలియదని, తెలంగాణలో కాంగ్రెస్‌ వచ్చేది లేదు.. సచ్చేది లేదు అంటూ మండిపడ్డారు. జనగామ జిల్లాలోని ‌మూడు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని పాగాల ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పోకల జమున, ఎంపీపీ కలింగరాజు, ఏఎంసీ చైర్మన్ సిద్దిలింగం, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ సీహెచ్ రాజమౌళి, మండల అధ్యక్షుడు బైరగోని యాదగిరిగౌడ్, కొమురవెల్లి మాజీ చైర్మన్‌ సేవెల్లి సంపత్, జెపాన్ శ్రీనివాస్ రెడ్డి, ఆకుల సతీశ్ కుమార్ పాల్గొన్నారు.