రోడ్డు ప్రమాదంలో యువ రైతు మృతి
పోటోరైటప్-మృతుడు అరవింద్
బోథ్, ముద్ర: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని వాగ్దారి గ్రామానికి చెందిన చౌహన్ అరవింద్ (23) శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఎస్ఐ సాయన్న తెలిసిన వివరాల ప్రకారం అరవింద్ అనే యువ రైతు తన భార్య సుష్మ తో కలిసి తన వ్యవసాయ క్షేత్రానికి ద్విచక్ర వాహనంపై వెళ్లగా వారి పొలంలో అమర్చిన సోలార్ బ్యాటరీలు పనిచేయకపోవడంతో వాటిని రిపేర్ చేయించటానికి ఇచ్చోడ కు వెళ్లి రిపేర్ చేయించుకుని తిరిగి ద్విచక్ర వాహనంపై పొలంలోకి వచ్చే క్రమంలో జాతీయ రహదారి 44 పై కుపిటీ గ్రామ సమీపంలో గుర్తు తెలియని వాహనం డీ కోనడంతో అక్కడిక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న ఎస్ఐ సాయన్న సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.