రెండు వర్గాల మధ్య ముగిసిన  వివాదం

రెండు వర్గాల మధ్య ముగిసిన  వివాదం
  • అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి స్థలం దానం

ముద్ర ఆదిలాబాద్: అంబేద్కర్ జయంతి ని  పురస్కరించుకొని విగ్రహం నిర్మాణానికి స్థలం గద్దె నిర్మాణంలో రెండు వర్గాల వారి మధ్య  ఏర్పటైనా  వివాదం  సద్దు మణిగింది. ఆదిలాబాద్ జిల్లా నేరదిగొండ  మండలం లోని పెద్ద బుగ్గరo గ్రామం లో అంబేద్కర్ విగ్రహం నిర్మాణానికి దళిత  సంఘాల  నాయకులు  గ్రామం లో గల ప్రభుత్వం స్థలం  లో నిర్మాణం కోసం  నిర్మించిన గద్దె ను  గ్రామం లో గల  గిరిజన తెగకు  చెందిన  వర్గం వారు కూల్చి వేశారు. దీనితో ఇరు వర్గాల  వారి మధ్య శుక్రవారం న  ఘర్షణలు జరిగిన్నాయి.

సమాసరం  తెలిసిన వెంటనే  ఇచ్చోడ పోలీస్ సీఐ నైలు, నేరదిగొండ  ఎస్ ఐ సాయన్న లు బుగ్గరం  గ్రామాన్ని కి వెళ్లి భారీ పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారు. పోలీస్ డి ఎస్ పి  నాగేందర్ సంఘటన స్థలానికి చేరుకొని  పరిస్థితులను పరిశీలించారు. అప్పటికే మండలం లోని దళిత సంఘాల  నాయకులు బుగ్గరం  గ్రామాన్ని చేరుకున్నారు. ఇరువర్గాల  ఘర్షణలో ఒకరికి తల  పగిలి నట్లు తెలుస్తుంది. గ్రామం లో తీవ్ర ఉద్రిక్త నెలకొంది. పోలీస్ అధికారులు దళిత  సంఘాల  నాయకులు, మరో  వర్గ మైన  గిరిజను లు, గ్రామ పెద్దల తో  సప్రదింపులు  చేసి , అంబేద్కర్ విగ్రహం నిర్మాణానికి గ్రామానికి చెందిన  నాయక్ స్థలం విరాళం గా ఇవ్వటానికి ముందుకొచ్చారు. దాత  ఇచ్చిన స్థలం లో విగ్రహం ఏర్పాటు కు దళిత సంఘాల  నాయకులు అంగీకరించడంతో  ఇరు వర్గాల  మధ్య ఏర్పాటు అయినా ఘర్షణలు సద్దు మనగ్గాయి. దీనితో గ్రామం లో ప్రశాంతత   ఏర్పాటయింది.