మానవత్వం కరువైన వేల ... గాయపడిన డ్రైవర్‌ను వదిలేసి మందు సీసాలు ఎత్తుకెళ్లిన జనం

మానవత్వం కరువైన వేల ... గాయపడిన డ్రైవర్‌ను వదిలేసి మందు సీసాలు ఎత్తుకెళ్లిన జనం

ముద్ర,సెంట్రల్ డెస్క్:-ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో జరిగిన ఒక షాకింగ్ సంఘటన మానవత్వాన్ని సిగ్గుపడేలా చేసింది. మద్యాన్ని తీసుకెళ్తున్న డీసీఎం ట్రక్కు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది...ప్రమాదం జరిగిన తరువాత, సంఘటనా స్థలంలో ఉన్న వ్యక్తులు గాయపడిన వారిని గమనించకుండా వదిలివేసి, కనీసం మానవత్వం లేకుండా రోడ్డుపై పడిన మద్యాన్ని దోచుకోవడం ప్రారంభించారు. విదేశీ, స్వదేశీ మద్యంతో వస్తున్న డీసీఎం ట్రక్కు అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.