మెదక్‌ జిల్లాలో రెండు లారీలు ఢీ.. నలుగురు మృతి

మెదక్‌ జిల్లాలో రెండు లారీలు ఢీ.. నలుగురు మృతి

మెదక్ జిల్లా చేగుంట 44 జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మధ్యప్రదేశ్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న లారీ ముందు వెళ్తున్న మరో లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెనుక లారీ క్యాబిన్ లో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. లారీలో ఇరుక్కున్న వారిని పోలీసులు బయటకు తీసి 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు.