మెదక్ బిఆర్ఎస్ అభ్యర్థి పద్మ ప్రచారం మహిళలకు వరం సౌభాగ్య లక్ష్మి

మెదక్ బిఆర్ఎస్ అభ్యర్థి పద్మ ప్రచారం మహిళలకు వరం సౌభాగ్య లక్ష్మి

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ బిఆర్ఎస్ అభ్యర్థి ఎం. పద్మ దేవేందర్ రెడ్డి శనివారం మెదక్ మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండలంలోని ర్యాలమడుగు, పేరూరు, మాచవరం, మంబోజపల్లి, మాక్దుంపూర్ గ్రామాల్లో మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు.  ఇంటింట ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను వివరిస్తూ... మరొకసారి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. పేరూరులో గులాబీ కండువాలు కప్పి పలువురిని పార్టీలోకి ఆహ్వానించారు.  గతంలో మాచవరం గ్రామం ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా ఉందో ప్రజలందరూ ఒక్కసారి గమనించాలని ప్రజల్ని కోరారు. గ్రామంలో 80 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తూ ఉంటారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షాన ప్రభుత్వాన్ని నడిపి రైతులకు 24 గంటల కరెంటు, రైతు బంధు, రైతు బీమా అందిస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మరోసారి ఆశీర్వదించాలని కారు గుర్తుకు ఓటేయాలని  విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి, జెడ్పి వైస్ చైర్ పర్సన్ లావణ్య రెడ్డి, ఎంపిపి యమునా జయరాం రెడ్డి, పాక్స్ చైర్మన్లు హన్మంత్ రెడ్డి, సీతారామయ్య, సర్పంచ్ రజని, ప్రభాకర్,ఎంపిటిసి మానస రాములు, నాయకులు  సుబ్బారావు, గంజి నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.