ఆశ వర్కర్లకు ఫిక్స్ డ్ వేతనం 18 వేలు నిర్ణయించాలి

ఆశ వర్కర్లకు ఫిక్స్ డ్ వేతనం 18 వేలు నిర్ణయించాలి
  • మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో వినతిపత్రం అందజేత

ముద్ర ప్రతినిధి, మెదక్:ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని మంగళవారం రోజున రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఆశా యూనియన్ (సీఐటీయు) ఆధ్వర్యంలో మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.  సీఐటీయు జిల్లా కోశాధికారి కె.నర్సమ్మ మాట్లాడుతూ... ఆశల సమస్యల పరిష్కారం కొరకు స్థానిక ఎమ్మెల్యే స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ సర్వే అయిన ఆశలతో చేయించుకుంటుంది. పారితోషకం పేరుతో పని భారం మోపుతూ ఆశాలను  శ్రమ దోపిడీకి గురిచేస్తుంది. పెండింగ్ పి.ఆర్. సి, ఎండిఎ, లెప్రసీ, ట్రేనింగ్ డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆశలపై అధికారుల వేధింపుల ఆపాలన్నారు. టార్గెట్ల పేరుతో ఆశాలను మానసికంగా ఇబ్బందుల గురిచేస్తున్న అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి.పీఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత  రూ,,25 లక్షల ప్రమాద భీమా సౌకర్యం కల్పించాన్నారు. కంప్యూటర్ ఆపరేటర్ శ్రీశైలంకు వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో  యూనియన్ జిల్లా కార్యదర్శి సావిత్రి, నాయకులు దేవమ్మ, శోభ, రాజేశ్వరి, సునీత,స్వప్న,  సరోజ, రాణి, పెంటమ్మా,పద్మ,దుర్గ, మంజుల తదితరులు పాల్గొన్నారు.