కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. రూ. 13 లక్షల కోట్లు ఆవిరి

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. రూ. 13 లక్షల కోట్లు ఆవిరి
  • 906 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 338 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 7 శాతానికి పైగా నష్టపోయిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్

దేశీయ స్టాక్ మర్కెట్లు ఈరోజు భారీ కుదుపుకు గురయ్యాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. ట్రేడింగ్ చివరి వరకు నష్టపోతూనే వచ్చాయి. ఒకానొక సమయంలో సెన్సెక్స్ 1,100 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 906 పాయింట్లు నష్టపోయి 72,762కి దిగజారింది. నిఫ్టీ 338 పాయింట్లు పతనమై 21,997కి పడిపోయింది. భారీ నష్టాల నేపథ్యంలో రూ. 13 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరయింది. చిన్న, మధ్య తరగతి కంపెనీల షేర్ల విలువ బుడగల్లా పెరుగుతూ వస్తోందని సెబీ చీఫ్ చేసిన వ్యాఖ్యలతో మార్కెట్లు కుదుపుకు గురయ్యాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఐటీసీ (4.49%), ఐసీఐసీఐ బ్యాంక్ (0.59%), కోటక్ బ్యాంక్ (0.44%), బజాజ్ ఫైనాన్స్ (0.33%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (0.01%). 

టాప్ లూజర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-7.28%), ఎన్టీపీసీ (-6.67%), టాటా స్టీల్ (-5.87%), టాటా మోటార్స్ (-4.28%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (-3.32%).