మీకోసం కార్యక్రమానికి చక్కటి స్పందన
- వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే పద్మ
- లబ్దిదారులకు గొర్రెలు పంపిణీ
ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ ఎమ్మెల్యే యం. పద్మాదేవేందర్ రెడ్డి మీకోసం కార్యక్రమానికి చేపట్టి ప్రజలు తరలివచ్చి వినతులు అందజేశారు. బుధవారం మెదక్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి తెచ్చారు . పింఛన్లు, ఇండ్లు మంజూరు, రెవిన్యూ తదితర సమస్యలను వివరిచారు. వెంటనే స్పందించిన ఎమెల్యే ఆయా శాఖల అధికారులతో మాట్లాడి సమస్యల పరిస్కారానికి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రామంలో జడ్పీ వైస్ చైర్ పర్సన్ యం.లావణ్య రెడ్డి, మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, కౌన్సిలర్ సమియొద్దీన్, కోఆప్షన్ సభ్యులు సయ్యద్ ఉమర్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మెదక్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి హవెలి ఘనపూర్ వాడి గ్రామంలో గొర్లను పంపిణీ చేశారు. అనంతరం వాడి గ్రామంలోని దూప్ సింగ్ తండా బ్రిడ్జి పనులను పరిశీలించారు.