డ్రైవర్ పై దాడితో  వికారాబాద్ ఆర్టీసీ డిపోలో నిలిచిపోయిన బస్సులు

డ్రైవర్ పై దాడితో  వికారాబాద్ ఆర్టీసీ డిపోలో నిలిచిపోయిన బస్సులు

వికారాబాద్, ముద్ర ప్రతినిధి: వికారాబాద్ ఆర్టీసీ డిపో డ్రైవర్ రాములు పై  నవాజ్ అనే ప్రయాణీకుడి దాడి తో ఆర్టీసీ ప్రైవేట్ డ్రైవర్లు
దాదాపు 27 ప్రైవేట్ హయ్యర్ బస్సులను నిలిపి నిరసన తెలిపారు. ఈ సంఘటన సోమవారం వికారాబాద్ లో చోటు చేసుకుంది. నిలిపి ఉన్న 
బస్సు అలస్యం పై  నవాజ్ అనే ప్రయాణీకుడి కి తాము భోజనం చేస్తున్నాం ఐదు నిమిషాల్లో బయలు దేరుతామని  డ్రైవర్, కండక్టర్లు చెప్పిన ప్పటికీ వినకుండా ఆగ్రహంతో డ్రైవర్ రాములు పై  నవాజ్ దాడికి పాల్పడ్డారు. కొందరు విడిపించేందుకు ప్రయత్నించినా వినకుండా దాడి కి దిగాడు. దీంతో వికారాబాద్ పోలీస్ స్టేషన్ లో బస్సు డ్రైవర్ రాములు.ఫిర్యాదు చేశారు.

నిందితుడు నవాజ్ పై చర్యలు తీసుకోవాలని బస్సులు నిలిపి ఆందోళనకు దిగిన ప్రైవేటు బస్సుల డ్రైవర్లు డిమాండ్  చేశారు.
దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేశామని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని డిపో మేనేజర్ హామీ ఇవ్వడంతో కదిలిన బస్సులు..ఎంతో మంది సురక్షితంగా గమ్యానికి చేర్చే బస్సు డ్రైవర్లపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని దాడి జరుగుతుందని ముందుగా గ్రహిస్తే తమకి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని వికారాబాద్ సిఐ నాగరాజు తెలిపారు.