అభివృద్ధి చూసి ఆశీర్వదించండి..

అభివృద్ధి చూసి ఆశీర్వదించండి..

కాంగ్రెస్ మోసపూరిత మాటలు నమ్మి మోసపోవద్దు..   ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి 

ముద్ర ప్రతినిధి, వికారాబాద్: వికారాబాద్ జిల్లా తాండూరులో ఈ రెండు సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి చూసి ఆశీర్వదించండని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సతీమణి ఆర్తి రెడ్డి  కోరారు. శుక్ర వారం తాండూరు పట్టణంలో 32వ వార్డులో ఆమె స్థానిక ప్రజాప్రతినిధిలు, నాయకులతో కలిసి ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డులో నీ మహిళలకు బీ అర్ ఎస్ పథకాలను వివరించారు. పార్టీ మానిఫెస్టో పై అవగాహన కల్పించారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత మాటలు నమ్మవద్దని ఆమె పేర్కొన్నారు. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి విజన్ ఉన్న నాయకుడు అని అన్నారు. ఆయనకు మరోసారి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీప నర్సింలు, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గద్దె వీణ శ్రీనివాస్ చారి, మాజీ మున్సిపల్ చైర్మన్ విజయ లక్ష్మి, మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ పరిమళ, కౌన్సిలర్స నరుకుల సింధుజ నరేందర్ గౌడ్, సీనియర్ నాయకులు నరుకుల నరేందర్ గౌడ్, పటేల్ కరుణాకర్, సిద్దలింగం, ప్రభు లింగం, సడిగి భద్రన్న, సంపత్, సంగమేశ్వర్, నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ రమేష్ టైలర్, యువజన విభాగం మహిళా నాయకులు పటేల్ సుప్రీత, అనిత రమేష్, నిర్మల మరియు వార్డు ప్రజలు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.