ఎన్నికల నిబంధనలను పకడ్బందీగా పాటించాలి

ఎన్నికల నిబంధనలను పకడ్బందీగా పాటించాలి
  • జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు హనుమంతు కే.జెండగే 

ముద్ర ప్రతినిధి భువనగిరి :క్షేత్రస్థాయిలో ఎన్నికల నిబంధనలను పకడ్బందీగా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు హనుమంతు కే.జెండగే అధికారులను ఆదేశించారు. శుక్రవారం సమావేశ మందిరంలో ఆయన నోడల్ అధికారులు, వివిధ టీముల అధికారులతో మాట్లాడుతూ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనందున క్షేత్రస్థాయిలో కోడ్ అమలు కోసం నిఘా వ్యవస్థ, ఫ్లయింగ్ స్క్వాడ్, సర్వైలెన్స్ స్టాటిస్టికల్ తదితర బృందాలు పడ్బందీగా విధులు నిర్వహించాలని, ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా అమలు చేయాలని తెలిపారు.

వంద నిమిషాలలో ఫిర్యాదులు పరిష్కరించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన సి విజిల్ యాప్ ను ప్రజలందరూ సద్వినియోగ చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. సువిధ యాప్ ద్వారా వచ్చిన దరఖాస్తులను సింగిల్ విండో పద్దతిలో సకాలంలో అనుమతులు జారీ చేయాలని తెలిపారు. ప్రశాంతంగా, సజావుగా ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా పనిచేయాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టరు ఎ.భాస్కరరావు, నోడల్ అధికారులు, వివిధ టీముల సభ్యులు పాల్గొన్నారు.