బిజెపి ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం....

బిజెపి ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం....

ఆలేరు (ముద్ర న్యూస్):రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా వైఫల్యం చెందారని ఆరోపిస్తూ బుధవారం నాడు హైదరాబాదులోని ఇందిరాపార్క్ దగ్గర కేంద్రమంత్రి మరియు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రంగాపురం కిషన్ రెడ్డి చేపట్టిన 24 గంటల దీక్షను రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని భగ్నం చేయడాన్ని నిరసిస్తూ గురువారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బిజెపి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్న ఎన్నికలలో మరోమారు ప్రజలను మోసం చేయడానికి అనేక కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.

రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ప్రజాస్వామ్యతంగా నిరసన చేస్తున్న కేంద్రమంత్రి మరియు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి దీక్షను పద్యం చేసి అక్రమంగా అరెస్టు చేయడానికి తప్పు పట్టారు. వెంటనే ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చేందుకు యుద్ధ పరిపాలిక చర్యలు తీసుకోవాలని లేకుంటే రానున్న ఎన్నికలలో ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు బడుగు జహంగీర్. మండల అధ్యక్షులు ఊసరి రాఘవేంద్ర గౌడ్. పట్టణ ఉపాధ్యక్షులు ఎలగందుల రమేష్. ప్రధాన కార్యదర్శి పులిపలుపుల మహేష్. కటకం రాజు. జిల్లా నాయకులు సముద్రాల శ్రీనివాస్. టోట మల్లయ్య. మండల ప్రధాన కార్యదర్శిలు మిట్టపల్లి భాస్కర్. వెంకటేష్. పట్టణ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు పస్తం ఆంజనేయులు. బీజేవైఎం పట్టణ అధ్యక్షులు పేరపు ఆనంద్. మండల అధ్యక్షులు మిట్టపల్లి సతీష్. ఆలేరు నియోజకవర్గ ఎన్నికల కోఆర్డినేటర్ బందేల గా సుభాష్. సీనియర్ నాయకులు పత్తి రాములు. కొమరయ్య. మడ్డెల వెంకటేష్. పూల హనుమంత్. నిజ భయం నాయకులు కంతుల శంకర్. కటకం వెంకటేష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు....