లంచం తీసుకుంటూ ఏసిబి కి పట్టుబడిన పిఆర్ఏఈ రమేష్ 

లంచం తీసుకుంటూ ఏసిబి కి పట్టుబడిన పిఆర్ఏఈ రమేష్ 

లంచం తీసుకుంటూ పంచాయతీ రాజ్ ఆలేరు మండల ఏఈ   రమేష్ శనివారం  ఏసిబికి చిక్కాడు.

భువనగిరి అక్టోబర్ 07 (ముద్ర న్యూస్) యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం శారాజిపేట గ్రామం లో సిసి రోడ్డు కాంట్రాక్టర్ శ్రీశైలం నుండి 80.000/రూపాయలు లంచం తీసుకుంటుండగా  రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. శారాజిపేట గ్రామంలో 16 లక్షల రూపాయలతో సిసి రోడ్లు అండర్ డ్రైనేజీ పనులు చేస్తున్న కాంట్రాక్టర్ను 5%వాటా కింద లంచం డిమాండ్ చేసి గత రెండు నెలలుగా ఎంబి రికార్డు చేయకుండా తిప్పుతుండగా విసుగు చెందిన కాంట్రాక్టర్  ఈ నెల 5వ తేదీన ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసాడు.

ఫిర్యాదును అందుకున్న ఏసీబీ అధికారులు  ఐదో తేదీ నుండి  నుండి కాంట్రాక్టర్ రమేష్ పై నిగా పెట్టి  శనివారం కాంట్రాక్టర్  నుండి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని ఏసీబీ   డి.ఎస్.పి  ఎం వి శ్రీనివాస్ తెలిపారు, ఆఫీస్ తో పాటుగా తన నివాసం తార్నాకలో కూడా ఏక కాలం లో సోదాలు నిర్వహించమన్నారు, ప్రస్తుతం ఏసీబీ కస్టడీ లోనే  ఏ ఈ రమేష్ ఉన్నాడని చెప్పారు, ఈ దాడుల్లో  డి.ఎస్.పి తో పాటు  ఏసీబీ  ఇన్స్పెక్టర్లు వెంకటరావు,రామారావు లు  ఉన్నారు.