అంబేద్కర్ భవనమును పరిశీలించిన ఎమ్మెల్యే

అంబేద్కర్ భవనమును పరిశీలించిన ఎమ్మెల్యే

 భువనగిరి అక్టోబర్ 07 (ముద్ర న్యూస్) భువనగిరి పట్టణంలో నిర్మిస్తున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవన నిర్మాణ పనులను ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి శనివారం స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. పనులను అతి తొందరగా పూర్తి చేయాలని పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఫోను ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమానికి అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధన సంఘం సభ్యులు కన్వీనర్లు బర్రె సుదర్శన్, నగరం అంజయ్య, కంచన పెళ్లి కౌన్సిలర్ వెంకట్ నాయక్, నరసింహారావు, భూతం యాదగిరి, నల్ల కృష్ణ, నిలిగొండ శివశంకర్, సిరిపంగ సుభాష్ తదితరులు పాల్గొన్నారు.