బిజెపి మతోన్మాద కార్పోరేట్ విధానాలకు వ్యతిరేకంగా మేడేను పండుగలాగా జరపాలి

బిజెపి మతోన్మాద కార్పోరేట్ విధానాలకు వ్యతిరేకంగా మేడేను పండుగలాగా జరపాలి

చెరుపల్లి సీతారాములు (సిపిఎం కేంద్ర కమిటి సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ)

భువనగిరి ఏప్రిల్ 15 (ముద్ర న్యూస్) కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న మతోన్మాద కార్పోరేట్ విధానాలను వ్యతిరేకిస్తూ మేడే ఉత్సవాలను పండుగలాగా జరపాలని నాయకులకు, కార్యకర్తలకు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు పిలుపునిచ్చారు. శనివారం సిపిఎం కార్యాలయంలో రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ అధ్యక్షతన జరిగిన పార్టీ జిల్లా కమిటీ సమావేశంలో వారు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల మీద, కార్మికుల మీద, వ్యవసాయ కూలీల మీద, రైతుల మీద, యువజన, విద్యార్థి, మహిళల మీద అనేక రకాల మతోన్మాద ముసుగులో దాడులు జరుగుతున్నాయని, సెక్యులర్ భారతదేశంలో మతాల పేరుతో కులాల పేరుతో ప్రజల మధ్య చీలికలను ప్రేరేపిస్తూ అల్లర్లకు తెరలేపుతున్నారని వారు అన్నారు. అదేవిధంగా గోరక్షక దళాల పేరుతో దళితుల మీద, మైనార్టీల మీద దాడులు బిజెపి ప్రభుత్వ హయాంలో పెరిగాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

బిజెపి పరిపాలిస్తున్న రాష్ట్రాలలో మహిళల మీద దాడులు లెక్కలేనన్ని జరుగుతున్నాయని వారు అన్నారు. ప్రజా ప్రయోజనకర విధానాలను పక్కకు పెట్టి దేశ ప్రజల మీద మతోన్మాదం ముసుగులో దాడులు చేయడం అల్లర్లను ప్రేరేపించడం బిజెపి పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని వారు అన్నారు. ఈ నేపథ్యంలో అనేకమంది కార్మికులు బలిదానం చేసి ఎనిమిది గంటల పని దినాన్ని అమలు చేసుకున్న మేడే ఉత్సవాలను ఒక పండుగలాగా కుటుంబం అంతా కలిసి జరుపుకోవాలని కార్మికులు, రైతులు వ్యవసాయ కూలీలు విద్యార్థి, యువజనలు, మహిళలు సమైక్యంగా మేడే ఉత్సవాలను బిజెపి మతోన్మాద కార్పోరేట్ విధానాలకు వ్యతిరేకంగా జరపాలని వారు పిలుపునిచ్చారు. వీరితోపాటు సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మంగ నర్సింహులు, మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, దోనూరి నర్సిరెడ్డి, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, దాసరి పాండు, మేక అశోక్ రెడ్డి, మండల కార్యదర్శులు సిర్పంగి స్వామి, దయ్యాల నర్సింహ, మాయ కృష్ణ,బొడ్డుపల్లి వెంకటేష్, జెల్లల పెంటయ్య, ఎండి పాషా, గుంటోజు శ్రీనివాసచారి, గుండు వెంకటనర్సు, దొడ యాదిరెడ్డి, బూర్గు కృష్ణారెడ్డి, బండారు నర్సింహ,బోలగాని జయరాములు, రాచకొండ రాములమ్మ, ఎంఎ ఇక్బాల్, గడ్డం వెంకటేష్, అవ్వారు రామేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.