ఏజేన్సి లో చాపకింద నీరులా కండ్ల కలక వ్యాప్తి 

ఏజేన్సి లో చాపకింద నీరులా కండ్ల కలక వ్యాప్తి 

ముద్ర,వెంకటాపురం (నూ):ములుగు జిల్లా వెంకటాపురం ,వాజేడు మండలలాలో ఇటివల దీర్ఘ కాలం గా, అకారణంగా కురిసిన  వర్షాల కారణంగా కండ్ల కలక వంటి కంటి ఇ న్ ఫే క్షన్ చాప కింద నీరులా వ్యాప్తి చెందుతుంది.ఈ రెండూ మండలాల్లోని అనేక గ్రామాల్లో ఈ వ్యాధి సోకి అనేక మంది ప్రజలు తీవ్ర ఇ బ్బందులకు గురి అవుతున్నారు.కండ్ల కలక దీనినే పింక్ కళ్లు అని కూడా పిలుస్తారు. దీని లక్షణాలు ఎరుపు, దురద, నీటితో నిండిన కళ్లు, కనురెప్పలు వాపు రావడం, కండ్లు గుచ్చుకోవడం ఎక్కువ వెలుగు చూడలేక పోవడం వంటి వాటితో బాధ పడతారు.

 •  ఎందుకు వస్తుంది? 

1 కండ్ల కలక అనేది వైరస్ లేదా బ్యా క్టి రియ లేదా ఏదైనా అలర్జీ వల్ల కలుగుతుంది.
2  వైరస్ లేదాబ్యా క్టి రియ  వల్ల  వచ్చే కలకలు ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాప్తి చెందుతాయి.
3  అలర్జీ వల్ల కలిగేది ఆ వ్యక్తి రోగనిరోధక వ్యవస్థ మీద మాత్రమే ఆధారపడి వుంటుంది. వైరస్ లేదా అలర్జీ వల్ల కలిగేది తక్కువ సమయంలో తీవ్రమైన లక్షణాలతో వస్తుంది. కానీ తే లికగా తగ్గిపోతుంది.
4  బ్యా క్టి రియ వల్ల కలిగేది కొన్ని రోజుల వ్యవధిలో పెరుగుతుంది. కానీ కన్ను మీద చాలా ఎక్కువ ప్రభావం ఉంటుంది. దీని వల్ల చూపు కూడా దెబ్బ తినే ప్రమాదం వుంటుంది.

 •  కండ్ల కలక సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్త లు 

 •     డాక్టర్ సూచించిన విధంగా కంటిచుక్కలు లేదా లూబ్రికెంట్స్ ఉపయోగించాలి .
     
 •      చేతులు తరుచూ శుభ్రంగా కడుక్కోవాలి.
 •     నల్ల కళ్ళద్దాలు వాడడం వల్ల కళ్ళు ముట్టుకోడం తగ్గి,ఈ వ్యాధి ఇ తరులకు సోకకుండా వుంటుంది.
 •     ఈ సమస్య ఉన్నప్పుడు జనంలో తిరగడం మానుకుంటే మంచిది
 •     కళ్ల కలక లు ఉన్న వారు వాడిన టవల్స్, కర్చీఫ్ లేదా చద్ధర్లు ఇ తరులు వాడకూడదు.
 •     ఆకుకూరలు, విటమిన్ ఎ  ఉన్న ఆహార పదార్థాలు ఎక్కువ గా తీసుకోవాలి.
 •     చిన్న పిల్లల కు ఇ లాంటి లక్షణాలు కనిపించినప్పుడు స్కూల్ కి పంపకుండా ,వ్యాప్తి ని అరికట్టడానికి ప్రయత్నించాలి.  

ఈ వ్యాధి పట్ల గిరిజన ప్రజలకు అవగాహన లేకపోవడం వల్ల ఈ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంది. కావున వై ద్య సిబ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహించ వలసిన అవసరం ఎంతో ఉంది అని రెండు మండలాల ప్రజలు కోరుకుంటున్నారు.