రేవంత్ రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలి

రేవంత్ రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలి

ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్
హనుమకొండ : రేవంత్ రెడ్డి రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ వద్దంటూ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మంగళవారం హనుమకొండలోని కాళోజీ జుంక్షన్ వద్ద బీ ఆర్ ఎస్ కార్యకర్తలు చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ నాయకత్వంలో  ధర్నా జరిపి,  కాంగ్రెస్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్బంగా  వినయ్ భాస్కర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత24గంటల కరెంట్, రైతు బంధు, రైతు బీమా, విత్తనాలు, ఎరువులు అందిస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు అందిస్తున్న పథకాలను దేశవ్యాప్తంగా  రైతులకు అందివాలనే సంకల్పంతో "ఆప్ కీ బార్ కిసాన్ సర్కార్" అనే నినాదంతో మా నాయకుడు ముందుకెళ్తున్నారని, దేశ ప్రజలు, దేశ వ్యాప్తంగా రైతులు అందరు సీఎం కేసీఆర్  వెంట వస్తున్నారన్నారు. 

రేవంత్ రెడ్డి రైతులకు 24గంటల ఉచిత కరెంట్ ను వద్దు అని చెప్పిన కాంగ్రెస్ మనుగడ ఉండదని,  తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని పాతర పెడతాం అని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను తీసుకు వచ్చిన అనేక మంది రైతుల బలిదానం చేసిందన్నారు. కేంద్ర మంత్రుల కొడుకులు వారి వాహనాలతో తొక్కించి రైతులను హత్య చేశారని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కుడా  చైర్మన్ సంగం రెడ్డి సుందర్ రాజ్ యాదవ్ , మాజీ కుడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.