మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి

మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి

జనగామ టౌన్‌, ముద్ర: మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలని మార్కస్ హోప్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ సంస్థ Marcus Hope Development Council organization నిర్వాహకురాలు దీప్తి రమేశ్ ఆకాంక్షించారు. జనగామలో శ్రీకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 308 మంది మహిళలలకు 3 రోజుల పాటు వాషింగ్ పౌడర్, దూప్ స్టిక్స్ పై తయారీపై శిక్ష ఇచ్చారు. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన కార్యక్రమంలో దీప్తి పాల్గొని మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల మహిళలకు ఉపాధి కల్పన కోసంఈ శిక్షణ ఎంతో దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో శ్రీకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకురాలు ఆలేటి కల్పలత, ట్రైనర్లు షరీఫున్నీసా, మంజుల, సుందరయ్య, టి.ఏ రెడ్డి పాల్గొన్నారు.