సమ్మె బాట పట్టిన గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మిక  సంఘాల జేఏసీ

సమ్మె బాట పట్టిన గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మిక  సంఘాల జేఏసీ

ముద్ర ఆత్మకూరు (ఎం):హక్కుల సాధన కోసం తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘాల జేఏసీ కమిటీ పిలుపు మేరకు   ఆత్మకూరు (ఎం) మండల  పంచాయతీ కార్మికులు  మండల పరిషత్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు కూరెళ్ళ కిష్టయ్య, గౌరవ అధ్యక్షులు నోముల మల్లయ్యలు మాట్లాడుతూ గ్రామాలలో ఎన్నో ఏళ్లుగా చాలీచాలని జీతాలతో జీవనపోరాటం చేస్తూ పారిశుధ్యం పని చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మల్టీ పర్పస్ వర్కర్ విధానంతో పని ఒత్తిడి పెంచడం జరుగుతుందన్నారు. తక్షణమే ఆ విధానాన్ని రద్దు చేయాలని , గ్రామ పంచాయతీకి సంబంధం లేకుండా నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే బ్యాంక్ ఖాతాలలో జీతాలు చెల్లించాలని డిమాండ్  చేశారు. సిబ్బందిని పర్మినెంట్ చేయాలని,కనీస వేతనం 19వేలు చెల్లించాలని, అర్హతను బట్టి పదోన్నతి కల్పించాలని, జీవిత భీమా రు. 2 లక్షల నుండి 5 లక్షల వరకు పెంచాలని, గ్రామ పంచాయతీ సిబ్బందికి ESI, PF ఇవ్వాలని, బకాయి వేతనాలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు పెండెం సత్యపాల్, ఉపాధ్యక్షులు రాగటి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి జ్ఞానేశ్వర్, సభ్యులు పంది స్వామి, సుదగాని రమేష్, బోడ రామ నర్సయ్య, మోత్కూరు పద్మ, సంగపాక చంద్రమ్మ, తాల్లపల్లి నర్సింహా పాల్గొన్నారు.