ఇంకెన్నాళ్ళు ఈ ఇంచార్జి లా పాలన?
- గ్రహణంవీడనివ్యవసాయశాఖ
ముద్ర ,వెంకటాపురం (నూ):ములుగు జిల్లా వెంకటాపురం మండలం లో రెగ్యులర్ వ్యవసాయ అధికారిని నియమించకుండ కాలం వెలబుచ్చు తున్నా ఉన్నతాధికారులు .మండలంలో దాదాపుగా ఐదువేల ఎకరాల లో మిర్చి పంట,రెండు వేల ఎకరాల లో మొక్కజొన్న పంట, మూడు వేల ఎకరాల లో వరి,ఇతర పంటలు సాగు చేస్తారు. ఇంత భారీ మొత్తంలో వ్యవసాయం చేసే మండలానికి రెగ్యులర్ వ్యవసాయ అధికారి లేదంటే ఇక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.మండల లో వేల ఎకరాలలో ఒప్పంద వ్యవసాయం (మిర్చి, మొక్కజొన్న) చేస్తున్నారు.దీని వల్ల ప్రతీ సంవత్స రం వందల సంఖ్యలో అమాయక గిరిజన రైతులు నష్ట పోతున్నారు.ఈ ఒప్పంద వ్యవసాయం గురించి ఏటువంటి సమాచారం వ్యవసాయ శాఖ వద్ద ఉండదు.ఇంత జరుగుతున్న వ్యవసాయ శాఖ చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నట్టు వ్యవహరిస్తుంది.వ్యవసాయ శాఖ పర్యవేక్షణ లోపం వల్ల మండలంలో పర్టిలైజర్ షాపు లు పుట్టగొడగుల్లా పుట్టుకొస్తున్నాయి. కొంతమంది ఏటువంటి అనుమతి పత్రాలు లేకుండా నాసీ రకం పురుగు మందులు,ఎరువుల బస్తాలు బహిరంగ మార్కెట్ లో అమ్ముతున్నారు.పురుగు మందులు అమ్మలంటే కనీసం అర్హత రసాయన శాస్త్రం లో డిగ్రీ పూర్తి చేసిన వారు అమ్మలని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పద్ధతి కి ఇక్కడ స్వస్తి పలికి ఏటువంటి అర్హత లేని వ్యక్తులు అమ్ముతూ గిరిజన అమాయకులను మోసం చేస్తు భారీ మొత్తంలో సరుకులను అంట్టగాట్టుతునారు.ఒక్క మండల కేంద్రం లోనే పదుల సంఖ్యలో పెర్టిలైజర్ షాపులు ఉన్నాయి అంటే ఇక్కడి పరిస్థితి కి అద్దం పడుతుంది. అట్లా మండలంలో భారీ సంఖ్యలో ఉన్నాయి. ఇక నైనా వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు గ్రహణం విడ్డి మండలానికి రెగ్యులర్ వ్యవసాయ అధికారి నీ నియమించి,నిరంతరం పర్యవేక్షిస్తూ మండల అమాయక రైతులకు న్యాయం చేయాలని పత్రిక ముఖంగా తెలియజేస్తున్నారు.