హుజూర్ నగర్ లో గెలిచేదినేనే ఉత్తమ్, సైదిరెడ్డిలు పగటి కలలు కంటున్నారు.

హుజూర్ నగర్ లో గెలిచేదినేనే ఉత్తమ్, సైదిరెడ్డిలు పగటి కలలు కంటున్నారు.
  • ఓజో ఫౌండేషన్ చైర్మన్-పిల్లుట్ల రఘు

హుజూర్ నగర్ టౌన్ ముద్ర:రానున్న హుజూర్ నగర్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేది తానే అని  ఓజో చైర్మన్ పిల్లుట్ల రఘు అన్నారు. సోమవారం పట్టణంలో  విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.ఉత్తమ్, సైదిరెడ్డిలు , పగటి కలలు కంటున్నారని,తాను కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేయడానికి గాంధీభవన్ లో దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ టికెట్ రాకపోతే ,ఇండిపెండెంట్ గానైనా పోటీ చేస్తానని చెప్పారు .నల్గొండ పార్లమెంటు సెగ్మెంట్ లో బీసీలకు మూడు స్థానాలను కేటాయించాల్సి ఉండగా, కానీ ఒక్క సీటు కూడా కేటాయించలేదని,అదే భువనగిరి పార్లమెంటు సెగ్మెంట్ లో  బీసీ లకు మూడు స్నానాలు కేటాయించారన్నారు,తాను ఓజో ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తున్నట్లు,యువతకు హైదరాబాదులో ఉచిత  ఎస్సై, కానిస్టేబుల్ శిక్షణలను ఏర్పాటు చేసినట్లు, ఆ శిక్షణా శిబిరాల ద్వారా ముగ్గురు ఎస్ఐ లు, 40 మంది కానిస్టేబుల్ ఉద్యోగాలు వచ్చినట్లు పేర్కొన్నారు. తాను కష్టపడి పైకి వచ్చానని రౌడీయిజం, గుండాయిజం చేయటం తనకు అలవాటు లేదని,నిస్వార్థంగా ప్రజా సేవ చేయడమే తనకు ఇష్టమని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో 20వేల కు పైగా మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. తాను పోటీ చేస్తుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ,సైదిరెడ్డిలకు వెన్నులో వణుకు మొదలైందని, ఈ సమాచారం ఇంటిలిజెన్స్ సర్వేల ఆధారంగా తెలిసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఓజో ఫౌండేషన్ ఇంచార్జ్ కుక్కల వెంకన్న, ఓజో పౌండేషన్ సభ్యులు కాకునూరి శివారెడ్డి, రాచమల్ల సైదులు, బొమ్మకంటి సైదులు, ఎల్లావుల శివశంకర్ ,నాగరాజు పాల్గొన్నారు.