సమీకృత వాణిజ్య భవనం ఎక్కడ

సమీకృత వాణిజ్య భవనం ఎక్కడ
  •  బీఎస్పీ సూర్యాపేట జిల్లా ఇన్చార్జ్ రాపోలునవీన్ సూటి ప్రశ్న

నేరేడుచర్ల ముద్ర:-నేరేడుచర్లలో అట్టహాసంగా శంకుస్థాపన చేసిన సమీకృత మార్కెట్ నిర్మాణాన్ని అర్ధాంతరంగా నిలిపి వేయడం పట్ల బహుజన్ సమాజ్ పార్టీ సూర్యాపేట జిల్లా ఇన్చార్జి రాపోలు నవీన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.గురువారం  నేరేడుచర్లలోని జాన్ పహడ్ రోడ్డులో అసంపూర్తిగా ఉన్న సమీకృత మార్కెట్ సముదాయాన్ని సందర్శించి, పునాదులలో బీఎస్పీ బృందంతో కూర్చొని నిరసన తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూసమీకృత వాణిజ్య భవన నిర్మాణం ఆగిపోతానికి కోర్టు కారణమని అబద్ధాలు చెబుతున్నారని, కోర్టుకు వేయించింది ఎవరో నిర్మాణం ఆగిపోతానికి పరోక్ష కారణం ఎవరో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్ఎస్పి స్థలానికి సంబంధించిన పత్రాలు బలవంతంగా లాక్కెళ్ళింది ఎవరో ప్రజలందరికీ తెలుసన్నారు .తమను ఎవరు గమనించడం లేదని కళ్ళు మూసుకొని పాలు తాగుతున్న పిల్లి చందoగా ప్రవర్తిస్తున్న వారికి రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని,మూల్యం చెల్లించుకునేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.

సాక్షాత్తు రాష్ట్ర మంత్రి, ఒక రాజ్యసభ సభ్యుడు, స్థానిక ఎమ్మెల్యేతో కలిసి శంకుస్థాపన చేసిన దానికే దిక్కు మొక్కు లేకుండా పోయిందని,, ఒక కోటి 90 లక్షల రూపాయలు విధులు మంజూరు చేసి, ఏమీ తెలియనట్టుగా స్థలం మాజీ యజమానిని రెచ్చగొట్టి కోర్టుకు వేయించి చోద్యం చూస్తున్నారని, నేరేడుచర్ల మున్సిపాలిటీ అభివృద్ధి కొరకు కోట్లకు కోట్లు మంజూరు చేస్తున్నట్టు పత్రికా ప్రకటనలు గుప్పిస్తున్నారే కానీ, అభివృద్ధి ఎక్కడో చూపించాలని ఆయన డిమాండ్ చేశారు. మారుమూల గ్రామాలకు స్మశాన వాటికలు నిర్మిస్తే మునిసిపాలిటీగా రూపాంతరం చెందిన నేరేడుచర్ల స్మశాన వాటికను ఒకసారి సందర్శిస్తానికి రావాలని ఆయన స్థానిక బిఆర్ఎస్ నాయకత్వాన్ని కోరారు.ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే, సమీకృత మార్కెట్  ను,స్మశాన వాటిక, బైపాస్ రోడ్డు నిర్మాణాన్నిచేపట్టాలని, ఆర్భాటంగా ప్రారంభించిన మిషన్ భగీరథ పథకంలో ఇంటింటికి తాగు నీరు అందించే ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమం లో నియోజకవర్గ ఇంచార్జి బొల్లాగాని సుబ్బు గౌడ్, ఉపాధ్యక్షలు జీలకర్ర రామస్వామి, పట్టణ అధ్యక్షులు కర్రీ సతీష్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి ఉప్పతల నవీన్, సురేష్, తదితరులు పాల్గొన్నారు.