మెదక్-ఎల్కతుర్తి రహదారి విస్తరణ బాధితుల వివరాలు సేకరించాలి

మెదక్-ఎల్కతుర్తి రహదారి విస్తరణ బాధితుల వివరాలు సేకరించాలి
  • హైవే, ఆర్ అండ్ బి అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశం

ముద్ర ప్రతినిధి:సిద్దిపేట:మెదక్-ఎలుకతుర్తి ఫోర్ లైన్స్ రహదారి నిర్మాణంలో భాగంగా కోల్పోతున్న నిర్మాణాల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలు సేకరించాలని  సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ అధికారులను ఆదేశించారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కలెక్టర్  సమావేశ మందిరంలో ఆర్ అండ్ బి,నేషనల్ హైవే అథారిటీ అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మెదక్-ఎలుకతుర్తి నాలుగు వరసల రహదారి నిర్మాణం పై సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంత్ మాట్లాడుతూ ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతలో భాగంగా చేపట్టిన మెదక్-ఎల్కతుర్తి నాలుగు వరసల నిర్మాణ పనులు జరుగుతున్నాయని, ఈ రహదారి గ్రామాల మీదుగా వెళ్ళినప్పుడు రహదారిని ఆనుకుని ఉన్న ఇండ్లు,ఇతర నిర్మాణాలను ప్రజలు కోల్పోతున్నారని అన్నారు. కోల్పోతున్న ఇండ్లు,ఇతర నిర్మాణాల వివరాలను ఆర్ అండ్ బి,నేషనల్ హైవే అథారిటీ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టపోతున్న నిర్మాణాల వివరాలను పూర్తిస్థాయిలో సేకరించి అందజేయాలని ఆదేశించారు.ఈ సమీక్షలో సమావేశంలో అండ్ బి ఇఇ రాము,నేషనల్ హైవే ఇఇ కరీంనగర్ మనోహర్,సిద్దిపేట అధికారి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు