హోలీ వేడుకల్లో మంత్రి జూపల్లి
ముద్ర.కొల్లాపూర్: కొల్లాపూర్ పట్టణంలో ప్రజలు ఘనంగా హోలీ సంబరాలు జరుపుకున్నారు. వేడుకల్లో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొని కొల్లాపూర్ ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,పట్టణ ప్రజలు మంత్రి జూపల్లి తో ఒకరికొకరు రంగులు పూసుకుని ఆహ్లాదకరమైన వాతావరణంలో స్నేహపూర్వక భావంతో సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో కొల్లాపూర్ పట్టణ కౌన్సిలర్ లు,మండల ఇతర ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు