కేరింతలతో రంగుల హోలీ సంబరాలు...

కేరింతలతో రంగుల హోలీ సంబరాలు...

ముద్ర,పానుగల్:-పానుగల్ మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో రంగుల హోలీ సంబరాలను కేరింతలతో చిన్న,పెద్ద అనే తేడా లేకుండా ఘనంగా జరుపుకున్నారు.

ఐక్యమత్యాన్ని పెంపొందించేలా కులమతాలకు అతీతంగా,పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరి జీవితాలలో ఆనందోత్సవాలు నిండాలని ఒకరినొకరు రంగులు చల్లుకుంటూ ఉదయం నుండి మధ్యాహ్నం వరకు వీధులలో తిరుగుతూ హోలీ సంబరాలను జరుపుకున్నారు.