ఫిబ్రవరి 16న గ్రామీణ బంధు, సమ్మెను జయప్రదం చేయండి 

ఫిబ్రవరి 16న గ్రామీణ బంధు, సమ్మెను జయప్రదం చేయండి 
  • రైతు సంఘం జిల్లా అధ్యక్షులు డి బాల్ రెడ్డి.

        
ముద్ర,వీపనగండ్ల:- బిజెపి ప్రభుత్వ అనుసరిస్తున్న రైతు కార్మిక ప్రజావ్యతిరేక విధానాలకు నిరసిస్తూ ఫిబ్రవరి 16 న జరిగే గ్రామీణ బంధు సమ్మెను జయప్రదం చేయాలని వీపనగండ్ల  మండల కేంద్రంలో తెలంగాణ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు, కె వి పి ఎస్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇంటింటి తిరుగుతూ కరపత్రాల పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా రైతు సంఘం వనపర్తి జిల్లా అధ్యక్షులు డి బాల్ రెడ్డి మాట్లాడుతూ బిజెపి కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం  చేసి కార్పొరేటర్ శక్తులకు అనుకూలంగా నిర్ణయాలు చేస్తుందన్నారు.

కేంద్రం అశాస్త్రయంగా నిర్ణయించిన కనీసం మద్దతులకంటే తక్కువ అమ్మడం వల్ల ఏటా రైతులు నాలుగు లక్షల కోట్లు నష్టపోతున్నారు నేటికి పంటల ప్రణాళిక లేకపోవడంతో రైతులు పెట్టిన పెట్టుబడి రాక అప్పులు తీరక ఆత్మహత్నలు పాల్పడుతున్నారు. ఢిల్లీలో జరిగిన రైతు ఉద్యమంలో రాతపూర్వకమైన హామీల నేటికీ అమలు చేయకపోవడం ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం అన్నారు. కేంద్ర బడ్జెట్ లో ఉపాధి హామీ పథకానికి బడ్జెట్ తక్కువ కేటాయించడం వల్ల ఆ పథకాన్ని నిర్వీర్యం చేయాలని ఆలోచనలు కేంద్ర ప్రభుత్వం ఉందని, దీనిని వెంటనే విరమిచ్చుకొని బడ్జెట్ పెంచాలన్నారు. నాలుగు లేబర్ కోడలు రద్దు చేయాలని విద్యుత్ సవరణ బిల్లు 2022 కావాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు మరలి, రైతు సంఘం జిల్లా నాయకులు ఈశ్వర్, సిఐటియు నాయకులు రామన్ గౌడ్, ప్రజా సంఘాల నాయకులు రామకృష్ణ, నవీన్, వెంకటేశ్వర్ గౌడ్  తదితరులు పాల్గొన్నారు.