డోన్‌లో మంటగలిసిన మానవత్వం
నంద్యాల జిల్లా డోన్‌లో మంటగలిసిన మానవత్వం. ఆస్తి కోసం కొడుకును చంపాలని తండ్రి ప్లాన్ చేశాడు. సుపారీ ఇచ్చి కొడుకుని కిడ్నాప్ చేయించిన తండ్రి. రెండు కార్లలో వినోద్‌ను కిడ్నాప్ చేసిన నిందితులు. కొడుకును చిత్రహింసలు పెట్టి సంతకాలు పెట్టించుకున్న నిరంజన్. వినోద్ ఐదేళ్ల కూతురి మెడపై కత్తి పెట్టి బెదిరించి ఆస్తి పేపర్లపై సంతకాలు పెట్టించుకున్న కిడ్నాపర్లు. కొంతకాలం కిందట కులాంతర వివాహం చేసుకున్న వినోద్. పోలీసులు స్పందించడంలేదని ఎస్పీని ఆశ్రయించిన వినోద్. ముగ్గురు అరెస్టు అయ్యారు. తండ్రి నిరంజన్ పరారీలో ఉన్నాడు.