BIG Shock To BRS: సిద్దిపేట లో బిఆర్ఎస్ కు షాక్
కాంగ్రెస్ లో చేరిన ముగ్గురు బిఆర్ఎస్ కౌన్సిలర్లు
మాజీ చైర్మన్ వివక్ష కారణంగానే పార్టీ వీడుతున్నామని స్టేట్మెంట్
సిద్దిపేట,ముద్ర ప్రతినిధి: సిద్దిపేట లో బిఆర్ఎస్ కు ఊహించని షాక్ తగిలింది,బిఆర్ఎస్ కు కంచుకోట అయిన సిద్దిపేట లో ముగ్గురు బిఆర్ఎస్ కౌన్సిలర్లు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల అయినప్పటి నుండి సిద్దిపేట రాజకీయాలు అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. బిఆర్ఎస్ కౌన్సిలర్లు కొంతమంది మాతో టచ్ లో ఉన్నారని కాంగ్రెస్ నాయకులు ఇటు అలా ఎప్పటికి జరగదని బిఆర్ఎస్ నాయకులు సవాళ్లు విసురు కుంటున్నారు.
కానీ అందరి ఆలోచనలను పటాపంచలు చేస్తూ బుధవారం పట్టణంలోని 7 వా వార్డు కు చెందిన ముత్యల శ్రీదేవి బుచ్చిరెడ్డి,20 వ వార్డు కౌన్సిలర్ రియాజ్,37 వ వవార్డు కౌన్సిలర్ సాకి ఆనంద్ లు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో నియోజకవర్గ ఇంచార్జ్ పూజల హరికృష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.దీంతో పట్టణంలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారిపోయింది... భవిష్యత్ లో ఇంకా ఎంత మంది జంపింగ్ జపాంగ్ ఉన్నారో అని ప్రజలు గుసాగుస లాడుతున్నారు.