ధనమే కాదు మనిషికి ధ్యానం కూడా అవసరమే

ధనమే కాదు మనిషికి ధ్యానం కూడా అవసరమే
  • ఆరోగ్యం లేకపోతే మనిషికి ఎంత డబ్బు ఉన్నా ఎందుకు
  • భౌతిక జీవనంలో పడి ఆధ్యాత్మికతను మర్చిపోతున్నారు
  • పేదలను చేరుకోవడానికి హార్ట్ ఫుల్ నెస్ ఇన్స్టిట్యూట్ విశేష కృషి
  • ముద్ర ప్రతినిధితో హార్ట్ ఫుల్ నెస్ ఇన్స్టిట్యూట్ తెలంగాణ రీజియన్ కోఆర్డినేటర్ బాబు గుర్రం ముఖాముఖి

సిద్దిపేట, ముద్ర ప్రతినిధి: ప్రతి మనిషికి భౌతిక జీవనమే ప్రధానం కాదని ఆధ్యాత్మిక జీవనాన్ని కూడా అలవర్చుకోవాలని అప్పుడే ప్రశాంతత లభిస్తుందని హార్ట్ ఫుల్ నెస్ ఇన్స్టిట్యూట్ తెలంగాణ రీజియన్ కోఆర్డినేటర్ బాబు గుర్రం చెప్పారు. సిద్దిపేటలో జరుగుతున్న యోగా మహోత్సవాలలో పాల్గొనడానికి విచ్చేసిన బాబు గుర్రం ముద్ర ప్రతినిధికి  ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అనేక విషయాలను వెల్లడించారు. రాష్ట్రంలో శ్రీ రామచంద్ర మిషన్ ద్వారా హార్ట్ ఫుల్ నెస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాదులోని ఖానా శాంతివనం పేరుతో 13 వందల ఎకరాల్లో ప్రపంచ ప్రధాన కేంద్రం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తమ హార్ట్ ఫుల్ 1,50,000 మంది వాలంటీర్లు ఉన్నారని వీరు దాదాపు పది లక్షల మందికి యోగా ధ్యానము అందించారని తెలిపారు. ప్రజలు పేదరికం నుంచి బయటపడితే అన్ని నేర్చుకోవడానికి ముందుకొస్తారని సమాజంలో వచ్చిన విపరీత ధోరణుల వల్ల ఆధ్యాత్మిక జీవనం మరచి భౌతిక జీవనాన్ని పట్టుకొని వేలాడుతున్నారని తెలిపారు.

మారిన పరిస్థితుల వల్ల ప్రజలు బిపి షుగర్ మానసిక ఒత్తిడిలకు లోన్ అవుతున్నారని ఆయన తెలిపారు. కేవలం ధనం సంపాదించగానే సరిపోదని మనిషి ఆరోగ్యవంతంగా జీవించడానికి ధ్యాన యోగ క్రియల్లోనూ రోజుకు అరగంట చొప్పున పాల్గొనాలని సూచించారు. నిత్యము రోగాలతో బాధపడుతూ మందులు వాడుతూ నరకయాతన పడే బదులు హార్ట్ ఫుల్ ఎక్కడికక్కడ రాష్ట్రంలో ఏర్పాటుచేసిన ధ్యాన కేంద్రాలకు వెళ్లి ఉచితంగా యోగ ధ్యానం నేర్చుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా హార్ట్ఫుల్నెస్కు 50 ఆశ్రమాలు 250 ధ్యానయోగ సెంటర్ లు ఉన్నాయని తెలిపారు.

వీటన్నింటి ద్వారా ప్రజలకు వివిధ రకాల ఉచిత సేవలు అందిస్తున్నట్లు బాబు గుర్రం వివరించారు దేశ 75వ స్వాతంత్ర ఉత్సవాలను పురస్కరించుకొని కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ ద్వారా నిర్వహిస్తున్న అమృత్ కాల్ మహోత్సవాల్లో భాగంగా యోగా మహోత్సవాలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హర్ దిల్ ధ్యాన్ హర్దిన్ మ్యాన్ పేరుతో మూడు రోజుల యోగ శిక్షణ కార్యక్రమాన్ని సిద్దిపేట డిగ్రీ కళాశాల గ్రౌండ్స్ లో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని తెలిపారు. రెండు విభాగాలుగా జరిగే ఈ సెషన్ను అందరూ వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.