మంత్రి హరీష్ రావుకు మద్దతుగా మొదలైన ఏకగ్రీవ తీర్మానాలు

మంత్రి హరీష్ రావుకు మద్దతుగా మొదలైన ఏకగ్రీవ తీర్మానాలు

సిద్దిపేటలో కుటుంబాలతో సహా మాల ఉద్యోగుల మద్దతు ప్రకటన

ముద్ర ప్రతినిధి: సిద్దిపేట: అభివృద్ధి కామకుడు, సిద్దిపేట ప్రగతి ప్రదాత మంత్రి తన్నీరు హరీష్ రావుకు మా కుటుంబ సమేతంగా మద్దతు తెలియజేస్తున్నాం.. ఈ విషయాన్ని ఏకగ్రీవంగా తీర్మానం చేస్తూ అందజేస్తున్నామంటూమాల ఉద్యోగ సంఘాలు నేతలు తమ కుటుంబ సభ్యులతో సహా సహా మద్దతులు తెలిపాయి.  జిల్లా కేంద్రమైన సిద్దిపేటలోని పద్మనాయక వెలమ కళ్యాణమండపంలో ఆదివారం నాడు మాల ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లాస్థాయి సమావేశానికి రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, విద్యుత్ శాఖ మంత్రి జి జగదీశ్ రెడ్డి ఎమ్మెల్యే గాదరి కిషోర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా మాల ఎంప్లాయిస్ అసోసియేషన్ భవన నిర్మాణానికి 500 గజాల స్థలాన్ని మంత్రి హరీష్ రావు మంజూరు చేశారు.

నియోజకవర్గం లో మొదట తనకు కుటుంబాలతో సహా మద్దతు తెలిపిన ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మీదేనని మీతోనే నాకు నియోజకవర్గం లో మద్దతు బోని ప్రారంభమైందని హరీష్ రావు చెప్పారు. ఈ సమావేశంలో మాల ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి స్వామి దాసు, డిప్యూటీ తాసిల్దార్ రాజేశం కార్యవర్గ సభ్యులు ఉద్యోగులు, కుటుంబంతో సహా పెద్ద ఎత్తున హాజరై మంత్రికి సంఘీభావం తెలిపారు.