జిల్లా పోలీసు అధికారులతో ఐజి సమావేశం

జిల్లా పోలీసు అధికారులతో ఐజి సమావేశం

సిద్దిపేట, ముద్ర ప్రతినిధి: మల్టీ జోన్ వన్ ఇన్స్పెక్టర్ జనరల్ చంద్రశేఖర్ రెడ్డి సోమవారం రోజున సిద్దిపేట పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జిల్లా పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.డివిజన్, సర్కిల్, పోలీస్ స్టేషన్లో,  పరిధి వివరాలు సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు, సందర్భంగా ఎస్ చంద్రశేఖర్ రెడ్డి,  మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశానుసారం ప్రతి పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు పెట్టడం జరిగిందన్నారు,  ప్రతిరోజు సీసీ కెమెరాలు మానిటర్ చేసుకోవాలని అధికారులకు సూచించారు,  మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీ ఉపయోగిస్తూ కేసులు చేదించాలన్నారు,  ప్రజలలో చాలా మార్పు వచ్చిందని  ఆ మార్పును గమనిస్తూ మనం కూడా మారుతూ ఉండాలన్నారు,  మనిషికి మార్పు అనేది చాలా ముఖ్యమన్నారు, అందరూ ఒక యూనిట్ గా పని చేయాలని తెలిపారు,  పోలీస్ అధికారులు చట్టపరిధిలో  పనిచేయాలని సూచించారు,  చట్ట ప్రకారం విధులు నిర్వహించి ప్రజలకు సేవ చేయాలన్నారు, దొంగతనాల  కేసులను చేదించి  కేసులలో నేరస్తులకు శిక్షలు పడేటట్లు క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలన్నారు.  సీసీ కెమెరాలు, నూతన టెక్నాలజీ  బాగా ఉపయోగించి కేసులు చేదించాలన్నారు,  కేసులు చేదనా/ కేసులన్నో ఉన్న నేరస్తులకు శిక్షలు పడడం  వలన నేరాల సంఖ్య తగ్గుముఖం పడుతుందన్నారు,  కోర్టు ట్రాయల్ సమయంలో కోర్టుకు వెళ్లాలని  తరచుగా మెజిస్ట్రేట్లను కలవాలని సూచించారు.  పోలీస్ స్టేషన్లో పరిధిలో ఉన్న గ్రామాలలో సీసీ కెమెరాలపై ఫోకస్ చేయాలన్నారు, సీసీ కెమెరాలు పనిచేయకపోతే వెంటనే రిపేర్ చేయించాలని సూచించారు, ప్రతి పోలీస్ అధికారి డాటా బేస్ తయారు చేసుకోవాలని సూచించారు.  సైంటిఫిక్ టెక్నాలజీ ద్వారా కేసులలో ముందుకు వెళ్లాలన్నారు,  పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి దరఖాస్తుపై చట్టప్రకారం నడుచుకొని విధులు నిర్వహించాలని సూచించారు.  ఏసీపీలు, సిఐలు పోలీస్ స్టేషన్ విజిట్ కు వెళ్ళినప్పుడు  పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశీలించాలన్నారు. ప్రోయాక్టివ్, డిజబుల్, కమ్యూనిటీ పోలీసింగ్ పై  దృష్టి సారించాలని అధికారులకు ఆదేశించారు. గంజాయి, ఐడీ లిక్కర్, డ్రగ్స్,  ఆర్గనైజ్డ్ గ్యాంబ్లింగ్,  పేకాట  తదితర చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై  నిఘా నిఘా ఉంచి  సమూలంగా నివారించాలని సూచించారు.

రాత్రి సమయాలలో విధులు నిర్వహించే పోలీస్ సిబ్బందికి ప్రజలతో ఎలా నడుచుకోవాలో తదితర అంశాల గురించి సిబ్బందికి అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. రాబోవు ఎలక్షన్స్ గురించి అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలన్నారు,  ఎన్ఫోర్స్మెంట్ వర్క్ పై  దృష్టి సారించాలని తెలిపారు, విఐపి, వివిఐపి, వచ్చిపోయే సమయాలలో  అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని అధికారులకు సూచించారు,  విధి నిర్వహణలో ఎలాంటి అలసత్వం వహించవద్దని సూచించారు. మహిళల రక్షణకు పెద్దపీట వేయాలని సూచించారు.

రూరల్ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన ఐజి

సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఐ జి చంద్రశేఖర్ రెడ్డి సందర్శించారు ఈ సందర్భంగా 5s ఇంప్లిమెంటేషన్ను పరిశీలించారు, సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ 5s ఇంప్లిమెంటేషన్ చేసిన దానిని  ఐజి గారికి సిపి శ్వేతా రెడ్డి స్వయంగా చూపించి ఎలా ఇంప్లిమెంటేషన్ చేశారో  వివరించారు. సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ 5s ఇంప్లిమెంటేషన్ అద్భుతంగా ఉందని  ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ ఇలానే తయారు చేయాలని అధికారులకు ఆదేశించారు.సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్లో 5s ఇంప్లిమెంటేషన్ చేసినా పోలీస్ అధికారులను సిబ్బందిని  పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేతా రెడ్డి మాట్లాడుతూ డి-మొబిలైజేషన్ మరియు అన్యువల్ స్పోర్ట్స్ మీట్ సమర్థవంతంగా నిర్వహించిన ఏఆర్ అధికారులను సిబ్బందిని అభినందించారు.  ప్రతి సంవత్సరం స్పోర్ట్స్ మీట్స్ నిర్వహించుకుంటామని తెలిపారు. స్పోర్ట్స్ పై ఇంట్రెస్ట్ ఉన్నవారు సివిల్, ఏఆర్ అధికారులు టీమ్స్ గా ఏర్పడితే ప్రతి నెల క్రికెట్ పోటీలు నిర్వహించుకుందామన్నారు.స్పోర్ట్స్, గేమ్స్, ద్వారా పని ఒత్తిడి తగ్గించుకోవచ్చని మరియు ఆరోగ్యంగా మరియు క్రమశిక్షణగా ఉండడానికి  ముఖ్యపాత్ర వహిస్తాయని తెలిపారు.టీమ్ స్పిరిట్స్ తో  ఏదైనా సాధించవచ్చని తెలిపారు.  ప్రతి మనిషిలో ఒత్తిడి ఉంటుందని తగ్గించుకోవడానికి గేమ్స్ స్పోర్ట్స్ యోగా రన్నింగ్ వాకింగ్ ప్రతిరోజు చేయాలని సూచించారు. విధి నిర్వహణ ఎంత ముఖ్యమో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమని తెలిపారు, జిల్లా పోలీసులు అందరూ ఒక టిమ్ యూనిట్ గా విధులు నిర్వహించినప్పుడు ఏదైనా సాధించవచ్చని తెలిపారు, లా అండ్ ఆర్డర్ పోలీసులతో సమానంగా ఏఆర్ పోలీస్ అధికారులు సిబ్బంది విధులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఏఆర్ సిబ్బంది నైపుణ్యాలను మెరుగుపర్చేందుకు, వారిని కొత్త సవాళ్లను స్వీకరించేందుకు సమాయత్తం చేసేందుకు ప్రతి సంవత్సరం డి-మొబిలైజేషన్ భాగంగా శిక్షణ మరియు  ఫైరింగ్ ప్రాక్టీస్ విధి నిర్వహణలో భాగంగా దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ ఎస్, మహేందర్, ఏఆర్ అడిషనల్ డిసిపిలు రామ్ చందర్ రావు, సుభాష్ చంద్రబోస్, సిద్దిపేట ఏసీపీ దేవారెడ్డి, గజ్వేల్ ఏసిపి రమేష్, ఎస్బి ఏసిపి రవీందర్ రాజు, సిసిఆర్బి ఏసిపి చంద్రశేఖర్, ఎస్బి ఇన్స్పెక్టర్ రఘుపతి రెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు శ్రీధర్ రెడ్డి, ధరణి కుమార్, రాజశేఖర్ రెడ్డి, రామకృష్ణ, ఇన్స్పెక్టర్లు, రవికుమార్, భాను ప్రకాష్, రూరల్ సీఐ జానకిరామ్ రెడ్డి, సీఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, ఏఆర్  సివిల్ మహిళా సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు.