ప్రతి ఇంటికి తాగునీరు నుంచి మహిళల కష్టాలు తీర్చాం

ప్రతి ఇంటికి తాగునీరు నుంచి మహిళల కష్టాలు తీర్చాం

మహిళా దినోత్సవ సభలో మంత్రి హరీష్ రావు

ముద్ర, దుబ్బాక: తొమ్మిదేండ్ల కిందట తెలంగాణకు ఇవాళ్టి తెలంగాణకు గుణాత్మకమైన మార్పు ఉన్నది... గత ప్రభుత్వాల హయాంలో ఎంతో మంది సీఎంలు వచ్చినా  తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డల మంచినీటి గోస తీర్చలేదని,సీఎం కేసీఆర్ వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికీ తాగునీరు అందించినట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని సిద్ధిపేట జిల్లా నియోజకవర్గ కేంద్రమైన దుబ్బాక కె ఆర్ ఆర్ ఫంక్షన్ హాల్ లో మంగళవారం ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, దుబ్బాక నియోజకవర్గ ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హరీశ్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చి తొమ్మిదేండ్లు పూర్తయి పడేండ్లలో అడుగు పెట్టిన వేళ. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరిపితే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు జీర్ణం అయితలేదని,వారు  ఈ కార్యక్రమాన్ని ఫెయిల్యూర్ అంటూ నోటికొచ్చినట్లుగా పిచ్చిగా మాట్లాడుతున్నారని ప్రతిపక్ష పార్టీలపై రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ఘాటుగా స్పందించారు. మూడు రోజుల్లో రూ.6 వేల కోట్లు వరి ధాన్యం డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాలలో జమ చేస్తాం. ఇప్పటి దాకా రూ.6 వేల కోట్లు వరి ధాన్యం డబ్బులు రైతులకు అందించాం. రైతులు పండించిన ప్రతి గింజ కొంటాం. రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదు. ప్రతి పక్షాలు చెప్పే మాటలు నమ్మొద్దు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ  పథకాలు లేవని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. 

డబుల్ ఇంజన్ సర్కారు అస్సాం రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కరెంటు లేదని ఫ్యాన్లు బంద్ చేయాలని ఆ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నదని, ప్రధాన మంత్రి సొంత రాష్ట్రం గుజరాత్ లో పవర్ హాలీడే ప్రకటించిందని మంత్రి హరీశ్ రావు విమర్శించారు.   ఇవాళ తెలంగాణలో లక్షల ఎకరాల్లో వడ్లు పండిస్తున్నామంటే రిజర్వాయర్లు నిర్మించి ఇచ్చిన మన కేసీఆర్ ఘనత కాదా? అని మంత్రి హరీష్ ప్రశ్నించారు.ఒకప్పుడు చెరువులో నీరు లేక చేపలు మృతి చెందితే. ఇవాళ చేపలు పట్టడానికి చెరువులో నుంచి నీరు వదలాల్సిన పరిస్థితి ఉందని సాగు కోసం ఇతర రాష్ట్రాల నుంచి నాట్లేసేందుకు మగ కూలీలు వస్తున్నారంటే తెలంగాణ అభివృద్ధి ఎంతుందో ఆలోచించాలని దుబ్బాక ప్రజలకు మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు.

ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మహిళలకు రిజర్వేషన్ ద్వారా అన్నింటా అవకాశాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కుతుందన్నారు. అనంతరం స్వయం సహాయక సంఘాల మహిళలకు వివిధ చెక్కులను మంత్రి చేతుల మీదుగా అందించారు. మహిళా దినోత్సవ సభలో దుబ్బాక పురపాలక సంఘ చైర్పర్సన్ గన్య వనితా భూమిరెడ్డి మండల పరిషత్ అధ్యక్షురాలు కొత్త పుష్పలత కిషన్ రెడ్డి నియోజకవర్గం ఎంపీటీసీలు వివిధ పాలకవర్గాల చైర్మన్లు వివిధ శాఖల అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.