సీఎం కేసీఆర్ మీద లోకాయుక్తలో ఫిర్యాదు

సీఎం కేసీఆర్ మీద లోకాయుక్తలో ఫిర్యాదు

ముద్ర, తెలంగాణ బ్యూరో: సీఎం కేసీఆర్ మీద లోకాయుక్తలో సిద్దిపేట జిల్లాకు చెందినమాజీ సైనికుడు బందెల సురేందర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ సైనికుల సంక్షేమం కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం అనేక జీవోలు అమలు చేసిందని తెలిపారు. ఐదు ఎకరాల అసైన్డ్ ల్యాండ్, 175 గజాల ఓపెన్ ప్లాటు కేటాయించినట్లు వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం ఈ జీవోను ఉపసంహరించిదని చెప్పారు.

మాజీ సైనికులకు ఇవ్వడానికి భూములు లేవంటూనే మరోవైపు ప్రభుత్వమే హైదరాబాద్ తోపాటు 33 జిల్లాలలో భూములకు వేలం వేస్తూ లే అవుట్లు చేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నదని ఆరోపించారు. మాజీ సైనికులు తమకు భూముల కేటాయించాలంటూ పలుమార్లు ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చామని, ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం అమ్ముతున్న భూముల వివరాలు, లేఔట్ లో వివరాలు, బీఆర్​ఎస్​ పార్టీ కార్యాలయాల కోసం కేటాయిస్తున్న భూముల వివరాలతో సహా లోకాయుక్తలో ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.