రక్తదానం చేసిన పోలీస్ కానిస్టేబుల్

రక్తదానం చేసిన పోలీస్ కానిస్టేబుల్

ముద్ర ప్రతినిధి: సిద్దిపేట:అత్యవసర సమయంలో రక్త  దానం చేసి మానవత్వాన్ని చాటారు ఓ కానిస్టేబుల్ వివరాలు ఇలా ఉన్నాయి.సిద్దిపేట పట్టణానికి చెందిన ఒక వ్యక్తి సిద్దిపేట ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా అత్యవసరంగా బి పాజిటివ్ బ్లడ్ అవసరం ఉన్నదని గ్రూపులో షేర్ చేశారు. ఈ విషయాన్ని పోలీసులు మిత్రుల ద్వారా సమాచారం తెలుసుకున సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ రాజు వెంటనే స్పందించి సిద్దిపేట ఎన్ ఎస్ వి బ్లడ్ బ్యాంక్ వెళ్లి బ్లడ్ డొనేట్ చేయడం చేశారు.ఈ సందర్భంగా చికిత్స పొందుతున్న బాధితుడు,అతని కుటుంబ సభ్యులు అత్యవసరం సమయంలో బ్లడ్ డొనేట్ చేసిన కానిస్టేబుల్ కు కృతజ్ఞతలు తెలిపారు.