దాల్చిన చెక్క

దాల్చిన చెక్క
Health Benefits From Cinnamon

Traditional Chinese Medicine సంప్రదాయ చైనీస్ వైద్యం, Western Traditional Herbal Medicine పాశ్చాత్య సంప్రదాయ మూలికావైద్యం (హెర్బలిజం) మరియు ఆయుర్వేద వైద్య పద్ధతుల్లో దాల్చినచెక్క (సినమన్) అతి ముఖ్యమైన మసాలా దినుసులలో ఒకటి. ఆధునిక వైద్యం లోని ఔషధాల్లో  మాత్రం దాల్చిన చెక్కను అంతగా ఉపయోగించడం లేదు. దీనిలోని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోవడంలో అల్లోపతి వెనుకపడిందనే చెప్పుకోవచ్చు. కానీ పూర్వం  అమ్మమ్మల వైద్యంలో దాల్చిన చెక్క తప్పనిసరిగా ఉండేది.


 నోటి ఆరోగ్యానికి... Cinnamon oil with cloves
లవంగంతో పాటు దాల్చిన నూనెను కలిపి  పంటి నొప్పుల నివారణకు ఉపయోగిస్తారు. కొన్ని వాణిజ్యపరమైన ఔషధాల వలె దాల్చినచెక్క కూడా  జిన్టివిటిస్ లక్షణాల నివారణకు, నొప్పిని తగ్గించడంలో  కూడా ప్రభావవంతంగా ఉపయోగపడుతుంది అని అధ్యయనాలు చెబుతున్నాయి. 

మొటిమలకు.. Cinnamon For pimples
దాల్చిన చెక్క సహజమైన వాపు నివారిణి. అలాగే యాంటీఆక్సిడెంట్ గా  కూడా పనిచేస్తుంది. అందువల్లే మొటిమలను తగ్గించే కొన్ని రకాల ఫేస్ మాస్కులకు దీని పొడిని ఉపయోగిస్తుంటారు.

బరువును తగ్గించడంలో... Cinnamon for weight Losing

దాల్చిన చెక్కలో వుండే సినిమాల్దిహైడ్ అనే ఎంజైమ్ శరీరంలోని కొవ్వుని కరిగిస్తుంది. అలాగే శరీరంలోని అధిక నీటిని బయటకు పంపించి బరువు తగ్గడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందుకే చాలా మంది దాల్చిన చెక్కను వేడినీటిలో మరిగించి తీసుకుంటూ వుంటారు. ఇలా తాగడం వాళ్ళ ఆకలి కూడా తగ్గుతుంది. శరీరంలో వున్నా కొవ్వు తో పటు టాక్సిన్స్ కూడా బయటకు వెళతాయి. 


హృదయానికి...
దాల్చిన చెక్కకు కొవ్వును కరిగించే స్వభావం ఉండటం వల్ల, రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.  ధమనుల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా రక్తప్రవాహం సాఫీగా ఉంటుంది. ఫలితంగా గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది. 

మధుమేహానికి.. 
దాల్చిన చెక్క క్రియాశీలక సమ్మేళనాల్లో చురుగ్గా పనిచేస్తుంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. అందువల్లనే రక్తంలోని చక్కెర స్థాయిలను దాల్చిన చెక్క అదుపులో ఉంచుతుందని  చాలా రకాల అధ్యయనాలు చెబుతున్నాయి. 

 రుతుక్రమంలో... Cinnamon to ease menstrual pain
రుతుక్రమంలో నొప్పిని తగ్గించడానికి దాల్చిన చెక్క చక్కగా పనిచేస్తుందని వివిధ అధ్యయనాలు చెబుతున్నాయి. రుతుక్రమంలో నొప్పిని, వికారాన్ని తగ్గించడంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ సమయంలో దాల్చిన టీని తాగడం వల్ల  తాజాగా అనిపిస్తుంది. 

ఉబ్బరానికి ...
కడుపులోని చాలా రకాల సమస్యలను దాల్చిన చెక్క తగ్గిస్తుంది. కడుపు ఉబ్బరం, మలబద్ధకం, వికారం... వంటి వాటి నివారణకు దాల్చిన చెక్కను విరివిగా వాడతారు. కడుపు పూతలకు కూడా ఇది ఉపయోగపడుతుంది.