రోడ్డు ప్రమాదంలో నంద్యాల టీడీపీ అభ్యర్థి ఎన్ఎండీ ఫరూక్ కు గాయాలు

రోడ్డు ప్రమాదంలో నంద్యాల టీడీపీ అభ్యర్థి ఎన్ఎండీ ఫరూక్ కు గాయాలు
  • నంద్యాల నుంచి కర్నూలు వెళుతుండగా ప్రమాదం
  • రోడ్డుకు అడ్డంగా వచ్చిన గేదెలు
  • బలంగా ఢీకొట్టిన ఫరూక్ కారు
  • ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో తప్పిన ముప్పు
  • స్వల్పగాయాలతో బయటపడిన ఫరూక్

నంద్యాల టీడీపీ అభ్యర్థి ఎన్ఎండీ ఫరూక్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఫరూక్ నంద్యాల నుంచి కర్నూలు వెళుతుండగా... పాణ్యం మండలంలో తమ్మరాజుపల్లె వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. రోడ్డుకు అడ్డంగా వచ్చిన పశువులను ఫరూక్ కారు ఢీకొట్టింది. కారులో ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో ఫరూక్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. కారు ముందుభాగం నుజ్జునుజ్జయింది.