మళ్ళీ మిర్చి రైతులని నట్టేట ముంచిన నకిలీ యు. ఎస్  341 మిర్చి విత్తనాలు, లబోదిబో అంటున్న నష్టపోయిన రైతులు

మళ్ళీ మిర్చి రైతులని నట్టేట ముంచిన నకిలీ యు. ఎస్  341 మిర్చి విత్తనాలు, లబోదిబో అంటున్న నష్టపోయిన రైతులు
  • నకిలీ విత్తనాల నారు మడులను పరిశీలించిన చెరుకూరి సతీష్ కుమార్ బిజెపి గిరిజన మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షులు,గొలకోటి త్రినాథరావు,కన్వీనర్

ముద్ర,వెంకటాపురం ( నూ): ములుగు జిల్లా, వాజేడు మండలం లో పేరూరు గ్రామములో నకిలి మిర్చి యు.ఎస్. 341 విత్తనాల వలన మొలకెత్తకుండా నష్టపోయినా రైతుల నారుమడులను పరిశీలించిన చెరుకూరి _సతీష్ కుమార్ ఎంపీపీ, బిజెపి గిరిజన మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షులు, గొలకొటి త్రినాథరావు,కన్వీనర్_ మాట్లడుతూ 3 సవత్సరాల క్రితం యు.ఎస్.341మిర్చి నకిలీ విత్తనాల వలన సుమారు 3000ఎకరాల మిర్చి రైతులూ నష్టపోతే రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా మోసం చేస్తే  హైకోర్టు కేసు తో రాష్ట్ర ప్రభుత్వం రెండు  సంవత్సరాలు లైసెన్స్ రద్దు చేసిందనీ,మరలా రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు లేకుండా ఈ సంవత్సరము మరలా యు. ఎస్. 341నకిలీ విత్తనాల వల్ల గింజలు మొలకెత్తకుండ రైతులు మరలా రోడ్డున పడ్డారని, ఎటువంటి అనుమతులు లేకుండా రైతులని నకిలీ విత్తనాల తో మోసం చేస్తున్నా నన్ హెమ్స్ ఇండియా ప్రే. లిమిటెడ్ కంపనీ మోసం చేస్తున్న ప్రభుత్వం చర్యలూ తీసుకోవడం లేదనీ అన్నారు, యు.ఎస్.341 విత్తనాలను బ్లాక్ చేసి డిమాండ్ క్రియేట్ చేసి యం.ఆర్.పి రేట్ల కంటే అధిక రేట్లకు నకిలీ విత్తనాలను అమ్మి మోసం చేస్తున్నా నన్ హెమ్స్ ఇండియా ప్రే. లిమిటెడ్ కంపనీ లైసెన్స్ రద్దు చేసి నష్టపోయినా మిర్చి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు హెమాసుందర్, బొల్లే వేంకటేశ్వర్లు, కన్నెబాయిన రవి, కవిరి నర్సింహారావు,రాంబాబు, పండ జయబాబు, రైతులు పాల్గొన్నారు.