బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో బ్యాంకింగ్, ఫైనాన్సులో ఉచిత శిక్షణ

బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో బ్యాంకింగ్, ఫైనాన్సులో ఉచిత శిక్షణ

ముద్ర ప్రతినిధి, నల్గొండ:తెలంగాణ రాష్ట్ర బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన అభ్యర్థులకు హైదరాబాద్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ట్రైనింగ్ ద్వారా హైదరాబాదులో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ లో రెండు నెలల నాన్ రెసిడెన్షియల్ ఉచిత ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని నల్గొండ టి.యస్. బిసి. స్టడీ సర్కిల్, డైరెక్టర్ విజయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంధర్భంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్ పూర్తయిన తర్వాత ప్రైవేట్ బ్యాంకుల్లో ప్లేస్మెంట్ ఉంటుందన్నారు. శిక్షణకు గ్రాడ్యుయేట్, 26 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న బి.సి అభ్యర్థులు ఈ నెల 15 నుండి 25 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. అర్హులైన అభ్యర్థులు www.tsbcstudycircle.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని, అభ్యర్థులను ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ఈ నెల 31 న నిర్వహించి వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు, ఇతర వివరాలకు టియస్ బిసి స్టడీ సర్కిల్, నల్లగొండ లేదా 08682-220007 నందు సంప్రదించవచ్చు తెలిపారు.